బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Aug 20, 2020 , 03:33:58

జ్వరం వస్తే నిర్లక్ష్యం వద్దు

జ్వరం వస్తే నిర్లక్ష్యం వద్దు

  • lకరోనా నిర్ధారణ పరీక్షలు    చేయించుకోవాలి
  • lనిర్లక్ష్యంతోనే ఎక్కువ మరణాలు
  • lడాక్టర్‌ డీసీ తిరుపతిరావు

కరీంనగర్‌ హెల్త్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని కరీంనగర్‌కు చెందిన సీనియర్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ డీసీ తిరుపతిరావు అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని తన హాస్పిటల్‌లో మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడితే వెంటనే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ దవాఖానలో ఇస్తున్న మందులను వాడుతూ మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగిస్తే సరిపోతుందన్నారు. కొందరు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో వారికి కొంత ఉపశమనం కలిగినా వైరస్‌ ప్రభావం శరీరంలోని అవయవాలపై పడుతుందని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత చికిత్స చేసినా ఫలితం లేకుండా పోతుందన్నారు. కరోనా కేసుల్లో కేవలం నిర్లక్ష్యంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. బాధితులు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటే తిరిగి కోలుకోవచ్చని చెప్పారు. సొంత వైద్యం చేసుకుని బయట తిరుగడంతోనే వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో తగ్గి ఇప్పుడు మన జిల్లాలో ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఇదే కారణమని తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గాలంటే అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి లక్షణాలున్నా పరీక్షలు చేయించుకొని హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు.