మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Aug 18, 2020 , 02:59:27

మాస్కు లేకుండా తిరిగితే జరిమానా

మాస్కు లేకుండా తిరిగితే జరిమానా

కొత్తపల్లి: పట్టణంలో మాస్కు లేకుండా బయట తిరిగితే సోమవారం నుంచి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తీర్మానం చేసినట్లు చైర్మన్‌ రుద్ర రాజు, పాలకవర్గ సభ్యులు తెలిపారు.  పట్టణంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున  ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని,  మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే తెరిచి ఉంచాలన్నారు. క్షౌరశాలలు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు తీయవద్దన్నారు. పాలకవర్గం తీర్మానాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే, పట్టణంలో కరోనా కట్టడికి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. వర్షాలు పడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

10 రోజులు దుకాణాల బంద్‌

కొత్తపల్లి పట్టణంలో కరోనా కట్టడికి సోమవారం నుంచి 10 రోజుల పాటు దుకాణాలకు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తామని వ్యాపారులు ప్రకటించారు. నిత్యావసర వస్తువులు, కిరాణా, మెడికల్‌ షాపులు మాత్రమే ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. కాగా, కరోనా కట్టడికి సహకరిస్తున్న వ్యాపారులకు మున్సిపల్‌ పాలకవర్గం తరఫున చైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు.