సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Aug 16, 2020 , 01:54:04

కరోనాను జయించడమే తొలి లక్ష్యం n మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 కరోనాను జయించడమే తొలి లక్ష్యం n మంత్రి కొప్పుల ఈశ్వర్‌

  • ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చర్యలు

జగిత్యాల, నమస్తే తెలంగాణ: ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర సాంఘిక, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉద్ఘాటించారు. 74వ స్వాత్రంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల కలెక్టరేట్‌లో శనివారం ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహమ్మారి కరోనాను జయించడమే మన ముందున్న తొలి లక్ష్యమని, ఇందుకు ప్రజలందరూ సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే ఆందోళనకు గురికావద్దని, 14 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండి, వైద్యులు చెప్పిన మందులు వాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో విస్తృతంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వంద పడకలతో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్‌ వచ్చి వారి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే వారికి దవాఖానలో ఐసీయూ వార్డుల్లో సేవలందించేందుకు ఏర్పాట్లు జరిగాయన్నారు.  కరోనా నేపథ్యంలో ఆర్థిక రంగం పూర్తిగా కుదేలైనా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, అదనపు కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, ఏఎస్పీ దక్షిణామూర్తి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

 మంత్రి సమక్షంలో చేరికలు

ధర్మపురి: ధర్మపురి మున్సిపల్‌ 14వ వార్డు కౌన్సిలర్‌ సయ్యద్‌ యూనుస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాపర్తి సత్యం శనివారం జగిత్యాలలో మంత్రి ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో ధర్మపురి ఏఎంసీ చైర్మన్‌ అయ్యో రి రాజేశ్‌కుమార్‌, సంగి శేఖర్‌, మ్యాన శంకర్‌ ఉన్నారు.