గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Aug 16, 2020 , 01:54:05

ఘనంగా ప్రణవ్‌బాబు జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రణవ్‌బాబు జన్మదిన వేడుకలు

హుజూరాబాద్‌ రూరల్‌:  మాజీ రాజ్య సభ సభ్యుడు వొడితల రాజేశ్వరావు మనమడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రణవ్‌బాబు జన్మదిన వేడుకలను  తుమ్మనపల్లిలో శనివారం నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ కౌరు సుగుణాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ ఏనుగు  సత్యనారాయణరెడ్డి, తుమ్మనపల్లి, మందాడిపల్లి సర్పంచులు గూడూరి ప్రతాప్‌రెడ్డి, ఎల్లయ్య, ఉప సర్పంచ్‌ బేతి రాజిరెడ్డి, ఆలయ చైర్మన్‌ కుమారస్వామి, బ్యాంకు డైరెక్టర్లు యతీశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, ఇజ్జిగిరి శంకర్‌, వార్డు సభ్యులు పెండ్యాల, నాయకులు చిరంజీవరెడ్డి, పోతారం భాస్కర్‌, వంశీరెడ్డి ఉన్నారు.

సైదాపూర్‌: మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ఎంపీ  రాజేశ్వర్‌రావు మనుమడు వొడితల ప్రణవ్‌బాబు జన్మదిన వేడుకలు  నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్‌చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెన్కేపల్లి సర్పంచ్‌ కొండ గణేశ్‌, మాజీ సర్పంచ్‌ కనుకుంట్ల విజయ్‌కుమార్‌, నాయకులు పైడిపల్లి రవీందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌,  నీర్ల సతీశ్‌, నెల్లి సంపత్‌, రమేశ్‌, అజయ్‌, అశోక్‌, వెంకట్రాజం ఉన్నారు.