మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Aug 14, 2020 , 03:24:47

మత్స్య సంపద పెంపునకు కృషి

మత్స్య సంపద పెంపునకు కృషి

పెద్దపల్లి కల్చరల్‌: మత్స్య సంపద పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్యం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఐదో విడుత జలశయాల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి శివారులోని ఎల్లమ్మ-గుండమ్మ (మినీ ట్యాంక్‌బండ్‌) చెరువులో గురువారం ఎమ్మెల్యే చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. యేటా నూరు శాతం సబ్సిడీతో చేపల పిల్లలను జలశయాల్లోకి వదులుతున్నామని వివరించారు. సంక్షేమ పథకాలను మత్స్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎల్లమ్మ-గుండమ్మ చెరువులో సుమారు లక్ష చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖాధికారి మల్లేశం, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి, కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్‌, కొలిపాక సంధ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, కొలిపాక చిరంజీవి, నర్సయ్య, మౌటం శంకర్‌, శంకర్‌, తిరుపతి  పాల్గొన్నారు. 

పెద్దపల్లిరూరల్‌: మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభు త్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి  పెద్దపల్లి మండలం అప్పన్నపేట పెద్దచెరువులో పోశారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాలోని 1076 చెరువుల్లో కోటి 53 లక్షల చేప పిల్లలను పోసి ముదిరాజ్‌లకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అప్పన్నపేట పెద్ద చెరువులో 90 వేల చేప పిల్లలను పోశామని తెలిపారు. గొప్ప కార్యక్రమాన్ని అమ లు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజ లు, ముదిరాజ్‌లు, మత్స్యకారుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ స్వరూప, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు  శ్రీనివాస్‌, విజయారావు, లక్ష్మయ్య, పిడుగు లక్ష్మీనారాయణ, తిరుపతి, నీలి సతీశ్‌, బొట్టు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.