బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Aug 13, 2020 , 01:54:10

రైతు వేదికలు సకాలంలో పూర్తి చేయాలి

రైతు వేదికలు సకాలంలో పూర్తి చేయాలి

  •  n హరితహారంలో నాటిన    ప్రతి మొక్కనూ సంరక్షించాలి
  •  nకలెక్టర్‌ శశాంక
  •  nబద్దిపల్లి, కమాన్‌పూర్‌ గ్రామాల్లో పర్యటన

కొత్తపల్లి: రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ శశాంక అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి, కమాన్‌పూర్‌ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను బుధవారం ఆయన పరిశీలించారు. నాణ్యతతో రైతు వేదికలు నిర్మించేలా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. హరితహారంలో భాగంగా బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం, బ్లాక్‌ ప్లాంటేషన్‌ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక్కడ బద్దిపల్లి సర్పంచ్‌ రాచమల్ల మధు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్‌, ఏవో రంజిత్‌కుమార్‌, పీఆర్‌ ఏఈ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌ రూరల్‌: మొగ్దుంపూర్‌లోని రైతువేదిక నిర్మాణం ఈనెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌లో నిర్మిస్తున్న రైతువేదిక పనులను బుధవారం  ఆయన పరిశీలించారు. వేదికలో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఫ్లోరింగ్‌ పూర్తి చేయాలని, స్టేజీ నిర్మాణంతోపాటు హాల్‌ విశాలంగా ఉండేలా నిర్మించాలన్నారు.  పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం

మొగ్దుంపూర్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో  పంచాయతీ కార్యదర్శి సల్మాన్‌పై కలెక్టర్‌ శశాంక  ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఎంపీడీవో పవన్‌కుమార్‌, తహసీల్దార్‌ గడ్డం సుధాకర్‌, మండల వ్యవసాయాధికారి సత్యం, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచులు నర్సయ్య, రాయమల్లు, ఎంపీటీసీ పుష్ప, ఉపసర్పంచ్‌ తిరుపతి యాదవ్‌,  తదితరులున్నారు.