శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 13, 2020 , 01:54:10

పోషకాహారాన్ని అందిద్దాం

పోషకాహారాన్ని అందిద్దాం

  • మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు

జమ్మికుంట : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారాన్ని అందిద్దామని మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు అన్నారు. పట్టణంలోని 6, 7వ వార్డుల్లోని గర్భిణులకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పాలు, గుడ్లు, పప్పు, బియ్యం, బాలామృతం తదితర పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న  పోషకాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఇక్కడ వార్డు కౌన్సిలర్లు శ్రీపతి నరేశ్‌, పొనగంటి సారంగం, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. 

ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు

పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నాయిని చెరువు, మోత్కులగూడెం, మాచినపెల్లి తదితర కాలనీలు, గ్రామానికి వెళ్లే దారిలో నీరు నిలిచింది. వరద నీటిని కాలువ తీయించి మళ్లించారు. అనంతరం  చైర్మన్‌ మాట్లాడారు. మున్సిపాల్టీ అభివృద్ధే ఎజెండాగా పాలకవర్గం పనిచేస్తున్నదని, సమస్యలుంటే నేరుగా తమకు సమాచారం అందించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట కమిషనర్‌, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, స్థానిక కాలనీవాసులు తదితరులు ఉన్నారు. 

మొక్కలను సంరక్షించాలి


logo