శుక్రవారం 30 అక్టోబర్ 2020
Peddapalli - Aug 13, 2020 , 01:54:11

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

  • ఏడీఏ దోమ అదిరెడ్డి

 హుజూరాబాద్‌ రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హుజూరాబాద్‌ ఏడీఏ దోమ అదిరెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని సింగాపూర్‌, సిర్సపల్లి, చెల్పూర్‌, కనుకులగిద్ద, హుజూరాబాద్‌లో రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను ఏడీఏ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నాణ్యతతో నిర్మాణ పనులు  చేపట్టాలని కోరారు. నెల రోజుల్లో భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. అయన వెంట ఏవో సునీల్‌కుమార్‌, సర్పంచులు నేరెళ్ల మహేందర్‌గౌడ్‌, గోపు కొమురారెడ్డి, ఏఈవో తదితరులు ఉన్నారు.

అధిక తేమతో నష్టం

మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున పంట పొలాల్లో నీరు నిల్వ ఉండి తేమ శాతం పెరుగుతుందని దీంతో దిగుబడులపై ప్రభావం చూపుతుందని సత్వర నివారణ చర్యలు చేపట్టాలని ఏడీఏ అదిరెడ్డి సూచించారు. బుధవారం అయన రైతులకు పలు సూచనలు, సలహాలు  అందజేశారు. హుజూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వానకాలం సీజన్‌లో  32 వేల ఎకరాల్లో పత్తి పంటను వేశారని రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పత్తి చేనులో నీరు నిల్వ ఉంటే ఏరుకుల్ల, అకుకుళ్లు తెగులు  వచ్చే ప్రమాదం ఉందని దీనికి సాధ్యమైనంత వరకు నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీయాలని సూచించారు. ఎకరాకు 20 నుంచి 25 కిలోల వరకు యూరియా, పొటాష్‌ కలిపి మొక్కకు అర ఫీట్‌ దూరంలో కొంక పద్ధతిలో వేయాలని అన్నారు. లేకుంటే కాపర్‌ అక్సిక్లోరైడ్‌ మూడు గ్రాములతోపాటు వంద ఎంఎల్‌ స్ట్రెప్టో సైక్లిన్‌ కలిపి ఎకరానికి పిచికారీ చేస్తే తెగులు నివారించవచ్చని  పేర్కొన్నారు.  రైతులు నత్రజని ఎరువులను తగ్గించాలని కోరారు. రైతులకు ఏదైనా సమాచారం కావాలంటే ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపాడు.