ఆదివారం 25 అక్టోబర్ 2020
Peddapalli - Aug 13, 2020 , 01:54:24

గోదావరి పరవళ్లు

గోదావరి పరవళ్లు

  • n కొనసాగుతున్న ఎత్తిపోతలు
  • n లక్ష్మీ బరాజ్‌ పంపులతో పని లేకుండా 2 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తున్న సరస్వతీ, పార్వతీ పంపులు.. 
  • n నంది, గాయత్రీ పంపు హౌస్‌ల్లో ఐదు మోటర్లతో పంపింగ్‌ 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ధర్మారం/రామడుగు/బోయినపల్లి: మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలతో 4,25,500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో కాళేశ్వరం లింక్‌-1 మేడిగడ్డ లక్ష్మీ బరాజ్‌లోని 57 గేట్లను ఎత్తి 4,30,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో బరాజ్‌ 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 11.40 టీఎంసీల నీరు చేరింది. లక్ష్మీ బరాజ్‌, పంపుహౌస్‌లతో పని లేకుండానే ఎగువన గల సరస్వతీ బరాజ్‌లోకి మానేరు నుంచి వస్తున్న 24,280 క్యూసెక్కుల వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో బరాజ్‌లో 10.87టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 9.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంథని మండలం కాసిపేట వద్ద ఉన్న సరస్వతీ పంపు హౌస్‌లో 8 పంపులు ఆన్‌ చేసి 23,200 క్యూసెక్కుల నీటిని ఎగువన గల పార్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో పార్వతీ బరాజ్‌లో 8.83టీఎంసీల సామర్థ్యానికి గాను 6.32టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో పార్వతీ పంపు హౌస్‌లోని 9 మోటర్లను ఆన్‌ చేసి 23,490 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. 20.17టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎల్లంపల్లిలో 11.26టీఎంసీల నీరు నిల్వ ఉండగా పార్వతీ పంపు హౌస్‌ నుంచి 23,490 క్యూసెక్కుల నీరు వస్తుండగా ఇతర వాగులు, వంకల నుంచి 1,965కూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. కాళేశ్వరం లింక్‌-2లోని ధర్మారం మండలం నంది పంపు హౌస్‌లోని 2, 3, 4, 5, 7 మోటర్లను ఆన్‌ చేసి 15,750 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌ గాయత్రీ పంపుహౌస్‌లో మొత్తం ఏడు మోటర్లను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 1,2,4,6,7 మోటర్ల ద్వారా జలాలను ఎత్తిపోస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 8.7 టీఎంసీల నీటిని ఎస్సారార్‌ జలాశయానికి తరలించారు. రానున్న రెండు రోజుల్లో పది టీఎంసీల నీరు ఎస్సారార్‌కు చేరుకుంటుందన్నారు. ఎత్తిపోతలను కాళేశ్వరం ప్రాజె క్ట్‌ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌, ఏఈలు పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎస్సారార్‌ జలాశయంలో 14.25టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 1,991 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరినట్లు పేర్కొన్నారు.logo