శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 12, 2020 , 02:56:50

భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి

భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి

  •  n కలెక్టర్‌ శశాంక
  •  n రెవెన్యూ అధికారులతో సమీక్ష

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: బొమ్మకల్‌లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ, శిఖం భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, రూరల్‌, అర్బన్‌ తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 మంది టీంతో కలిసి బొమ్మకల్‌లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ, శిఖం భూములను సర్వే చేయాలన్నారు. ఆక్రమణకు గురైన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్‌ పక్కనే భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, ఆక్రమణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించాలని, బొమ్మకల్‌ గ్రామంలో మిగతా ప్రభుత్వ సర్వే నంబర్లు కూడా సర్వే చేయిస్తామన్నారు. సర్వే చేసిన అనంతరం ఆక్రమణలను తొలగిస్తామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ఇంటి నిర్మాణం కోసం బోగస్‌ అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా కూడా డాక్యుమెంట్లు తెప్పించుకుని వాటిని కూడా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. బోగస్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి, ప్రభుత్వ శిఖం భూమిలో ఉన్న ప్లాట్లను తొలగిస్తామన్నారు. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు త్వరగా తెలపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. logo