గురువారం 01 అక్టోబర్ 2020
Peddapalli - Aug 10, 2020 , 01:37:27

పండుగలా హరితహారం

పండుగలా హరితహారం

కొత్తపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని కొత్తపల్లి పట్టణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగలా చేపడుతున్నారు. మున్సిపల్‌ పరిధిలో 41,240 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటి వరకు 90 శాతం మేర నాటారు. గత జూలై 25న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్‌ కొత్తపల్లి మున్సిపల్‌ పరిధిలోని రాణిపూర్‌ రోడ్డు మార్గంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పాలకవర్గం, అధికారులు రోడ్లకు ఇరువైపులా, శ్మశాన వాటికలు, డంపు యార్డులు, ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. వీటితో పాటు ప్రతి ఇంటికి ఆరు చొప్పున సుమారు 24 వేల పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేసి, సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 6 వేలు, డంపు యార్డులో 200, ఇనిస్టిట్యూషనల్‌ ప్లాంటేషన్‌లో భాగంగా 1500, కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా 4 వేల మొక్కలు నాటారు. పీహెచ్‌సీ ఆవరణతో పాటు ఖాళీ స్థలాల్లో మరో 1500 మొక్కలు నాటారు. మియవాకి పద్ధతిలో 4 వేల మొక్కలు నాటేందుకు ఎకరం స్థలం సిద్ధం చేశారు. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పడుతున్నారు. హరితహారంలో మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములవుతుండడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంటామని పాలకవర్గం, అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


తాజావార్తలు


logo