గురువారం 01 అక్టోబర్ 2020
Peddapalli - Aug 10, 2020 , 01:37:50

కాళేశ్వరం టూ ఎస్సారార్‌

కాళేశ్వరం టూ ఎస్సారార్‌

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ధర్మారం/రామడుగు: వృథాగా పోతున్న ప్రాణహిత జలాలను ఒడిసిపపట్టి నెర్రెలీనిన నేలను తడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. లింక్‌-1,2లో 35 మోటర్లు నిరంతరాయంగా ఎత్తిపోస్తుండడంతో మేడిగడ్డ నుంచి ఎస్సారార్‌ జలాశయం దాకా గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నది. రోజుకు రెండు టీ ఎంసీల చొప్పున ఎదురెక్కి వస్తున్న జలాలతో 175 కిలోమీటర్ల మేర జలసిరిని సంతరించుకున్నది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు మేడిగడ్డ వద్ద గోదావరిలో కలుస్తున్నది. అక్కడ 35 గేట్లను ఎత్తి 1,08,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 16.17 టీఎంసీల సా మర్థ్యంతో నిర్మించిన లక్ష్మి బరాజ్‌లో ప్ర స్తుతం 11.14 టీఎంసీల నీరు ఉన్నది. దీనికి అనుసం ధానంగా నిర్మించిన లక్ష్మి పంప్‌హౌస్‌లోని 11పంపుల్లో 10 మోటర్లను ఆన్‌చేసి 21180 క్యూసెక్కుల నీటిని సరస్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. 10.87 టీఎంసీల సామర్థ్యం గల ఈ బ రాజ్‌లోకి లక్ష్మి నుంచి 21180 క్యూసెక్కు లు, మానేరు నుంచి వస్తున్న 782 క్యూసెక్కుల వరదనీటితో 9.47 టీఎంసీల నీరు చేరింది. దీంతో ఈ బరాజ్‌కు అనుసంధానంగా ఉన్న సరస్వతీ పంప్‌హౌస్‌లోని ఎనిమిది మోటర్లకు గానూ ఏడు పంపుల ను ఆన్‌చేసి 21180ల క్యూసెక్కుల నీటిని ఎగువన గల పార్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో పార్వతీ బరాజ్‌లో 8.83టీఎంసీల సామర్థ్యానికి గాను 6.05 టీఎంసీల నీరు చేరింది. ఇక్కడి పంప్‌హౌస్‌లోని మొత్తం 9 పంపులను న డిపించి 20880 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లిలోకి పంపింగ్‌ చేస్తున్నారు. 20.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎల్లంపల్లిలో 9.51టీఎంసీల నీరు నిలువ ఉండగా పార్వతీ పంప్‌హౌస్‌ నుంచి 20880 క్యూసెక్కుల నీరు వస్తుండగా ఇతర వాగులు, వంకల నుంచి 309 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇక్కడి నుంచి కాళేశ్వరం లింక్‌-2లోని నంది పంపుహౌస్‌లోని 2,4,5,6,7 మో టర్లను ఆన్‌చేసి 15750 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. రామడుగు మండ లం లక్ష్మీపూర్‌లో నిర్మించిన గాయత్రీ పంప్‌హౌస్‌లోని 1,2,4,6,7 పంపులను ఆన్‌చేసి 17750 క్యూసెక్కుల నీటిని ఎస్సారార్‌లోకి ఎత్తి పోస్తున్నారు.  

ఎల్‌ఎండీ, ఎస్సారార్‌లను నింపడమే లక్ష్యం 

-నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేర కు కాళేశ్వరం నుంచి ప్రతిరోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తి పోస్తూ ఎల్‌ఎండీ, ఎస్సారార్‌ను నింపడమే లక్ష్యంగా ముందుకెళ్తు న్నామని కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా పార్వతీ పంపుహౌస్‌, గ్రావిటీ కెనాల్‌ డెలివరీ సిస్టర్న్‌లను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు బరాజ్‌ లు, ఐదు పంపుహౌస్‌లలోని ఇంజినీర్ల బృందం ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో పనిచేస్తుందని చెప్పారు. 

ఎస్సారార్‌లో 9.242 టీఎంసీల నీరు

బోయినపల్లి: బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం పూర్తి సామర్థ్యం 25. 873 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9. 242 టీఎంసీల నీరు నిలువ ఉన్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. లక్ష్మీపూర్‌ గాయత్రీ పంప్‌హౌస్‌ నుంచి మోటర్ల ద్వారా 15, 453 క్యూసెక్కుల నీరు వస్తున్నదని వెల్లడించారు.  


logo