మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Aug 09, 2020 , 01:06:52

ఉద్యోగులను అప్రమత్తం చేయండి

ఉద్యోగులను అప్రమత్తం చేయండి

యైటింక్లయిన్‌ కాలనీ/ గోదావరిఖని  : సింగరేణి వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్నందున ఆయా ఏరియాల్లో ఉద్యోగులను మరింత అప్రమత్తం చేయాలని సింగరేణి డైరెక్టర్‌ (పా) చంద్రశేఖర్‌ సూచించారు. ఈ మేరకు ఆయన డైరెక్టర్‌ ఫైనాన్స్‌ బలరాం, జీఎం పర్సనల్‌ ఆనంద్‌రావు, జీఎంలు బసవయ్య, నాగభూషణరెడ్డితో కలిసి అన్ని ఏరియాల జీఎంలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సింగరేణి సంస్థలోని అన్ని ఏరియాల్లో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, పీపీఈ కిట్స్‌  అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆర్జీ-2 జీఎం సురేశ్‌ మాట్లాడుతూ ఆర్జీ-2లో కొవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలను డైరెక్టర్‌కు వివరించారు. సమావేశంలో ఎస్‌వో-2 జీఎం సాంబయ్య, ఏజెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ రమేశ్‌బాబు, పర్సనల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌, మేనేజర్‌ సుబ్రహ్మణ్యం తదితరులున్నారు.