మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Aug 07, 2020 , 03:52:29

మార్గదర్శకుడు జయశంకర్‌ సార్‌

మార్గదర్శకుడు జయశంకర్‌ సార్‌

ధర్మపురి/ బుగ్గారం/ పెగడపల్లి/ మెట్‌పల్లి టౌన్‌/ కోరుట్ల/ఇబ్రహీంపట్నం/ కోరుట్ల రూరల్‌/ గొల్లపల్లి/ మేడిపల్లి:ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 86వ జయంతిని గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకున్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ ఆయన మార్గదర్శకుడని పేర్కొన్నారు.ధర్మపురి ఏఎంసీలో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్‌ రాజేశ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సునీల్‌కుమార్‌, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు. బుగ్గారం మండలం శెకళ్ల గ్రామంలో ఉప సర్పంచ్‌ అఫ్సర్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ జయంతి నిర్వహించారు. సర్పంచ్‌ వెల్గటూర్‌ మమత,వార్డు సభ్యులు, కార్యదర్శి ఉన్నారు. పెగడపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ శోభ జయశంకర్‌ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ ఆవరణలో ఏఎంసీ చైర్మన్‌ తిరుపతినాయక్‌ మొక్కలు నాటారు. ఎంపీడీవో వెంకటేశం, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీవో మహేందర్‌ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు, పాలక వర్గ సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సుజాత  పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జయశంకర్‌  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బోయినిపెల్లి చంద్రశేఖర్‌ రావు, టీఆర్‌ఎస్‌ ప్రచార కార్యదర్శి గంగాధర్‌ పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయశంకర్‌ జయంతిని టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్వహించారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు పవన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, కౌన్సిలర్లు అన్వర్‌, లక్ష్మీనారాయణ, గుండోజి శ్రీనివాస్‌, లోకిని వెంకి, నాయకులు కరుణాకర్‌, సజ్జు, రాజరెడ్డి, ఫహీమ్‌, సనావొద్దీన్‌, రహీమ్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మం డలం భర్తీపూర్‌లో సర్పంచ్‌ సాగర్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ జయంతి నిర్వహించారు. ఉప సర్పంచ్‌ శ్రవణ్‌, కార్యదర్శి వినయ్‌, ఏఈవో హరీశ్‌, బీపీఎం పాల్గొన్నారు. మెట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి ఎంపీపీ మారు సాయిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో రాజశ్రీనివాస్‌, ఎంపీవో మహేశ్వర్‌, నాయకుడు పాక నర్సయ్య తదితరులున్నారు. చౌలమద్దిలో తుల గంగవ్వ మెమోరియల్‌ ట్రస్టు చైర్మన్‌ తుల రాజేందర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేశారు. జగ్గసాగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. పుల్ల జగన్‌గౌడ్‌, డాకూరి వెంకటేశ్‌, కోరం నరేశ్‌ పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యాలయాల్లో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీలు, కార్యదర్శులు  పాల్గొన్నారు. కోరుట్ల మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ తోట నారాయణ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జడ్పీటీసీ లావణ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీవో మమత, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. గొల్లపల్లి మండల పరిషత్‌ కార్యాలయం, మార్కెట్‌ యార్డులో జయశంకర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేశాశారు. ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ గోస్కుల జలంధర్‌, ఏఎంసీ చైర్మన్‌ ముస్కు లింగారెడ్డి, విండో అధ్యక్షుడు మాధవరావు, వైస్‌ ఎంపీపీ సత్తయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రమేశ్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ముస్కు కిష్టారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌  గంగాధర్‌, డైరెక్టర్లు వెంకటరమణ, మోహన్‌, రాజన్న, వెంకన్న పాల్గొన్నారు. మేడిపల్లి మండల కేంద్రంతోపాటు పోరుమల్ల, కట్లకుంట, గూండ్లపల్లి, దమ్మన్నపేట, వెంకట్రావుపేట, భీమారం, మన్నెగూడెం, కల్వకోట, కోండాపూర్‌, లింగంపేలో జయశంకర్‌  జయంతి నిర్వహించారు. ఎంపీపీ ఉమాదేవి, సర్పంచులు వంగ వెంకటేశం, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, గడ్డం నారాయణరెడ్డి, కాచర్ల సురేశ్‌, ద్యావనపెల్లి అభిలాష్‌, చెక్కపెల్లి అరుణ, తౌటి తిరుపతిరెడ్డి, ఆదె హన్మక్క, ఈర్నాల సంపత్‌కుమార్‌, ఎంపీటీసీలు చెన్నమనేని రవీందర్‌రావు, సుధవేని లక్ష్మి, భూమేశ్‌గౌడ్‌, పన్నాల లావణ్య, పల్లి అర్జున్‌, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, ఎంపీడీవో పద్మజ, కార్యదర్శులు, వీఆర్వోలు, సిబ్బంది పాల్గ్గొన్నారు.