సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Aug 06, 2020 , 02:39:50

చెరువుల్లోకి చేప పిల్లలు

చెరువుల్లోకి చేప పిల్లలు

  • n  కరీంనగర్‌ జిల్లాలో       2.36 కోట్ల మీనాలు.. 
  • n  802 చెరువుల్లో పెంపకం
  • n  నేడు ఎల్‌ఎండీలో వదలనున్న మంత్రి గంగుల కమలాకర్‌

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.  2016 నుంచి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్నది.  చెరువులు, కుంటల్లోనే కా కుండా ఎల్‌ఎండీ లాంటి రిజర్వాయర్లలో కూడా ప్రభుత్వం చేపలు పెంచుతోంది. అందులో భా గంగా ఈ ఏడాది 802 నీటి వనరుల్లో చేపలు పెం చాలని నిర్ణయించి సుమారు 2.36 కోట్ల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణ యిం చింది రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఖధీర్‌ అహ్మద్‌ తెలిపారు. 

  ఈ యేడు 2.36 కోట్ల విత్తనాలు.. 

ఈ యేడు చెరువులు, కుంటలతోపాటు ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో చేపలు పంచేందుకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. 8 వేల హె క్టార్ల నీటి విస్తీర్ణంలో ఉన్న ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో గతేడాది లాగే ఈ సారి కూడా 30 లక్షల చేప విత్తనాలు వదలనున్నారు. ఈ రిజర్వాయర్‌లో 80-100 మిల్లీ మీటర్ల చేప విత్తనాలు వదలనున్నారు. 8-10 నెలల పాటు నీటి నిలువ ఉంటే 709 సీజనల్‌ చెరువుల్లో కోటి 57 లక్షల 37 వేల చేప విత్తనాలు వదులుతున్నారు. ఏడాది పొడుగు నా నీళ్లు ఉండే 82 చెరువుల్లో 48.62 లక్షల చేప విత్తనాలు వదులుతున్నారు. గతేడాది 750 చెరువుల్లో మాత్రమే చేపలు వదలగా ఈ సారి 802 చెరువుల్లో పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు..

  నేడు ఎల్‌ఎండీలో వదలనున్న మంత్రి.. 

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద పూర్తి ఉ చితంగా పంపిణీ చేస్తున్న ఈ చేప విత్తనాలను గు రువారం ఉదయం 10 గంటలకు ఎల్‌ఎండీ రిజర్వాయర్‌పై ఉన్న లెక్‌ పోలీస్టేషన్‌ సమీపంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఖదీర్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ సహా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్న ట్లు  తెలిపారు. ఎల్‌ఎండీలో గతంలోలాగే 30 లక్షల చేప విత్తనాలు వదులుతున్నట్లు చెప్పారు.