గురువారం 24 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 04, 2020 , 02:32:41

102 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

102 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

పెగడపల్లి: మండలంలోని కీచులాటపల్లి గ్రామంలో సోమవారం 102 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు మల్యాల సివిల్‌ సైప్లె నాయబ్‌ తహసీల్దార్‌ ఎం రాకేశ్‌కుమార్‌ తెలిపారు. గ్రామంలోని ఓ రేకుల షెడ్డులో రేషన్‌ బియ్యం నిల్వ చేశారనే పక్కా సమాచారంతో దాడులు చేశామన్నారు. సుమారు 218 సంచుల్లో బియ్యం లభించినట్లు తెలిపారు. వీటిని తూకం వేయగా 102 క్వింటాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ బియ్యాన్ని గ్రామానికి చెందిన పర్వతాల రంగయ్య, పర్వతాల మహేశ్వరి నిల్వ చేసినట్లు విచారణలో తేలిందని, వీరిపై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని మల్యాల సివిల్‌ సైప్లె గోదాంకు తరలించారు. దాడుల్లో పెగడపల్లి గిర్దావర్‌ అనిల్‌కుమార్‌, వీఆర్వో సాల్మాన్‌రాజ్‌ పాల్గొన్నారు.


logo