గురువారం 24 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 04, 2020 , 02:32:41

బొమ్మకల్‌ సర్పంచ్‌ అరెస్ట్‌

బొమ్మకల్‌ సర్పంచ్‌ అరెస్ట్‌

  • n   భూ కబ్జాలు, దౌర్జన్యాలపై  బాధితుల ఫిర్యాదులు   
  • n    కోర్టులో హాజరు పరిచి  రిమాండ్‌కు తరలింపు
  • n    ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
  • n   రెవెన్యూ అధికారుల హస్తంపై విచారణ

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో భూకబ్జాలు, దౌర్జన్యాలకు సంబంధించి సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌తో పాటు అతడికి సహకరించిన పలువురిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. కొంతకాలంగా బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో భూకబ్జాలు జరుగుతున్నాయని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వారు విచారణ జరిపి నిందితులపై కేసులు నమోదు చేశారు. వారు తెలిపిన ప్రకారం వివరాలు.. బొమ్మకల్‌లో సర్వే నంబర్‌ 33లో 25 గుంటల స్థలాన్ని సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌తో పాటు మిర్జా, మహ్మద్‌ అబ్దుల్‌, మతిన్‌, అబ్దుల్‌ ఖాదర్‌, మిర్జా అసద్‌బేగ్‌, మహ్మద్‌ అస్మదుల్లా, సర్దార్‌ అవతార్‌సింగ్‌ తదితరులు కబ్జా చేశారని షేక్‌ గౌస్‌ జానీ ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే  సర్వే నంబర్‌ 126లోని ప్లాట్‌ నంబర్‌ 14ను తాను కొనుగోలు చేయగా, సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌, యేదున బాల్‌రెడ్డి, మాచర్ల సత్యనారాయణ, మాచర్ల మల్లేశం లక్ష్మి కన్‌స్ట్రక్షన్‌ పేరిట దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టారని ముస్తాల లక్ష్మణ్‌  అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బొమ్మకల్‌ శివారులోని సర్వే నంబర్‌ 48లో ఏ8-15 గుంటల భూమికి సంబంధించిన రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి ఎర్‌సింగ్‌ విష్ణువర్ధన్‌, ఎర్‌సింగ్‌ శేషువర్ధన్‌, ఎర్‌సింగ్‌ మాలకొండయ్య, సుల్తా మొహియొద్దీన్‌, సర్పంచ్‌  పురుమల్ల శ్రీనివాస్‌తో పాటు అబ్దుల్‌ రహీం, ఎండీ అబ్దుల్‌ కలీం, మహ్మద్‌ ఖాసీం, ఎహియా అనే వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారని సయ్యద్‌ కలీముల్లా ఖాద్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్‌ 679/9లో గల ఎకరం మూడు గుంటల భూమిని బొమ్మకల్‌ గ్రామానికి చెందిన పురుమల్ల శ్రీనివాస్‌, జగన్మోహన్‌రావుకు కోటి ఇరువై లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదరగా, కొంత మొత్తం చెల్లించి, ఖాళీ బాండ్‌ పేపర్‌పై సంతకాలు తీసుకొని మోసం చేశారని నాయిని శరత్‌ చంద్రప్రకాశ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్లాట్‌లుగా మార్చి విక్రయించుకొని డబ్బులు ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. వీటితో పాటు బొమ్మకల్‌ గ్రామంలోని పలు సర్వే నంబర్లలో జరిగిన భూ విక్రయాల్లో సైతం ప్రజా ప్రతినిధితో మరికొందరు ల్యాండ్‌ మాఫియాగా ఏర్పడి దౌర్జన్యాలకు పాల్పడడంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌లలో కొందరు రెవెన్యూ అధికారుల హస్తంపై పోలీసులు, ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతున్నది. కాగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌ను రూరల్‌ పోలీసులకు అప్పగించగా, వారు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. 


logo