ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Aug 03, 2020 , 01:34:57

కేక్‌ కట్‌ చేసి..మొక్కలు నాటి..

కేక్‌ కట్‌ చేసి..మొక్కలు నాటి..

కొడిమ్యాల: మండల పరిషత్‌ అధ్యక్షురాలు మేన్నేని స్వర్ణలత జన్మదినం సందర్భంగా ఆదివారం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పలు గ్రామాల్లో కేక్‌ కట్‌ చేశారు. అలాగే మొక్కలు నాటారు. మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  వైస్‌ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్‌, మార్కె ట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు. మండలంలోని పూడూర్‌లో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సింగిల్‌ విండో అధ్యక్షుడు మేన్నేని రాజనర్సింగారావు కేక్‌ కట్‌ చేశారు.  ఇక్కడ క్లబ్‌ అధ్యక్షులు కార్తీక్‌చంద్ర, మాజీ సర్పంచ్‌ లింగాగౌడ్‌ ఉన్నారు. తిర్మలపూర్‌, నల్లగొండ గ్రామాల్లో ఎంపీటీసీ సభ్యులు బసనవేణి మహేశ్‌, చీకట్ల సింధు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు గంగుల మల్లేశం ఉన్నారు. తిప్పాయపల్లిలో సర్పంచ్‌ మ్యాకల లత, టీఆర్‌ఎస్‌  గ్రామ అధ్యక్షుడు నరేడ్ల గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మ్యాకల మల్లేశం తదితరులు ఉన్నారు.