బుధవారం 23 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 03, 2020 , 01:34:57

హరిత నగరానికి సహకరించాలి

హరిత నగరానికి సహకరించాలి

కార్పొరేషన్‌: కరీంనగర్‌ను సుందరమైన, హరితనగరంగా మార్చేందుకు నగరంలోని ప్రజలందరూ సహకరించాలని రాష్ట బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. హరితహరం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని గిద్దెపెరుమాండ్ల దేవాలయ ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించగా మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్‌లో అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఈ సారి 50లక్షల మొక్కలు నాటుతున్నామని, నగరంలో 12లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు. బ్లాక్‌ ప్లాంటేషన్‌, మియావాకి పద్ధతిలో అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని వివరించారు. మొక్కల సంరక్షణను ప్రజలు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ సారి హరితహారంలో నాటిన మొక్కల్లో 80 శాతానికి పైగా కాపాడుతామన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలన్నింటిల్లోనూ పెద్దసంఖ్యలో మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, కార్పొరేటర్‌ ఐలేందర్‌, స్వప్న, జయశ్రీ, దేవాలయ కమిటీ చైర్మన్‌ కలర్‌ సత్తన్న, నాయకులు తిరుపతి, సత్యం, రాజేందర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. logo