బుధవారం 05 ఆగస్టు 2020
Peddapalli - Aug 01, 2020 , 03:19:04

డీపీవోల నియామకం

డీపీవోల నియామకం

కరీంనగర్‌/ పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ జగిత్యాల : కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లా పంచాయతీ అధికారులను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

- డీఎల్‌పీవోగా ఉండి మంచిర్యాల జిల్లా డీపీవోగా అదనపు బాధ్యతలు చూస్తున్న వీ బుచ్చయ్యకు డీపీవోగా పదోన్నతి కల్పించి కరీంనగర్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. కాగా, గ్రూ ప్‌-1 అధికారిగా ఉండి కరీంనగర్‌లో కొంతకాలం పని చేసిన ఎం రఘువరన్‌ జయశంకర్‌ భూపాలపల్లికి బదిలీ అయ్యారు. 

- జగిత్యాల డీపీవోగా వేముల శేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలో డివిజనల్‌ పంచాయతీ అధికారిగా పనిచేస్తూ పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన ఆయనకు పదోన్నతి కల్పించి పూర్తి స్థాయి డీపీవోగా నియమించింది.

- పెద్దపల్లి డీఎల్‌పీవోగా ఉన్న వేముల సుదర్శన్‌ రీ డిప్లాయిడ్‌ డీపీవోగా కొనసాగుతుండగా, ఆయనకు పదోన్నతి కల్పించి రెగ్యులర్‌ డీపీవోగా నియమించింది. 


logo