సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Jul 31, 2020 , 01:35:33

బక్రీద్‌ శాంతియుతంగా జరుపుకోవాలి

బక్రీద్‌ శాంతియుతంగా జరుపుకోవాలి

  •  తహసీల్దార్‌ రవీందర్‌  n వివాహాలకు అనుమతి తీసుకోవాలని సర్పంచ్‌లకు సూచన

బెజ్జూర్‌ : బక్రీద్‌ పండుగ శాంతియుతంగా జరుపుకోవాలని తహసీల్దార్‌ రవీందర్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవధ చట్టరీత్యా నేరమని అన్నారు. ఏఎస్‌ఐ ఆశన్న, కోఆప్షన్‌ సభ్యుడు బషీరత్‌ ఖాన్‌, సర్పంచ్‌ హుస్సేన్‌, మత పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.  

పెంచికల్‌ పేట : కరోనా నేపథ్యంలో బక్రీద్‌ వేడుకలు ఇంటి వద్దే నిర్వహించుకోవాలని  తహసీల్దార్‌ రఘునాథ్‌ రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో స ర్పంచ్‌లు, ముస్లిం మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు శాంతి యు తంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం సర్పంచ్‌లతో మా ట్లాడుతూ, గ్రామాల్లో వివాహాలు ఎవరైనా జరుపుకుంటే తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.  ఆర్‌ఐ సంతోష్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.