బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jul 29, 2020 , 01:32:37

బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ

మంథని రూరల్‌: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ భరోసానిచ్చారు. ఎక్లాస్‌పూర్‌, సూరయ్యపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పెద్దపల్లి జిల్లా  పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మంగళవారం పరామర్శించారు. ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన  మందల రవీందర్‌ రెడ్డి, బొడ్డు శంకరయ్య, మోత్కూరి ఓదెలు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా సూరయ్యపల్లి గ్రామానికి చెందిన భీముని రాజయ్య, జంజర్ల రాజయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సైతం ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలతా శంకర్‌లాల్‌, సర్పంచ్‌ సదానందం, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, మంథని లక్ష్మణ్‌, తదితరులు ఉన్నారు.