మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jul 28, 2020 , 02:27:38

దేశానికే ఆదర్శం ‘హరితహారం’

దేశానికే ఆదర్శం ‘హరితహారం’

  •  ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో కోట్ల మొక్కల పెంపకం
  •  నాటిన ప్రతి మొక్కనూ కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది 
  •  సేవ్‌ ట్రీ కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథనిటౌన్‌: తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ అ త్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. పట్టణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కోసం సోమవారం ఉదయం మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సేవ్‌ ట్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంథని ఆర్టీసీ డిపో నుంచి గోదావరిఖని లింక్‌ రోడ్డు వరకు మంథని-గోదావరిఖని ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండు కిలో మీటర్ల మేర కాలినడకన వెళ్తూ పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో కోట్ల మొక్కల పెంపకంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ప్రధాన రహదారి వెంట నాటిన మొక్కలు సంరక్షించేందుకు  పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడంతోపాటు ట్రీ గార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాకింగ్‌కు వెళ్లే ప్రజలు ప్రధాన రహదారి వెంట ఉండే మొక్కలను ప్రతి రోజూ పరిశీలిస్తూ వాటి ఎదుగుదలకోసం కృషిచేయాలని కోరారు. భవిష్యత్తుతరాల మనుగడ కోసం ప్రజ లు తమ బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు సంరక్షణకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ పరిధిలో నాటి న మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్య లు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు వీకే రవి, కుర్రు లింగయ్య, సమ్మయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, మిర్యాల ప్రసాద్‌రావు, కుంట శ్రీనివాస్‌, బత్తుల సత్యనారాయణ, ఉప్పట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ 

మంథని రూరల్‌: ఎక్లాస్‌పూర్‌కు చెందిన ఎంపీటీసీ పెండ్లి చైతన్య ప్రభాకర్‌రెడ్డి నానమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సోమవారం పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ  శంకర్‌, సర్పంచ్‌ సదానందం, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, కుంట శ్రీనివాస్‌,  రమేశ్‌, లక్ష్మణ్‌, రాజు తదితరులు ఉన్నారు.