మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jul 28, 2020 , 02:27:44

ఐసొలేషన్‌ వార్డుల్లో సకల సౌకర్యాలు

ఐసొలేషన్‌ వార్డుల్లో సకల సౌకర్యాలు

  • ఆర్జీ-1 జీఎం నారాయణ
  • సింగరేణి ఏరియా దవాఖాన సందర్శన

గోదావరిఖని: సింగరేణి ఆర్జీ-1 పరిధి సింగరేణి ఏరియా దవాఖానలోని ఐసొలేషన్‌ వార్డుల్లో సకల సౌకర్యాలు కల్పించినట్లు జీఎం నారాయణ తెలిపారు. స్థానిక సింగరేణి ఏరియా దవాఖానను సోమవారం ఆయన సందర్శించారు. ఈ మేరకు పీపీఈ కిట్‌ను ధరించిన ఆయన దవాఖానలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. కరోనా పాజిటివ్‌ కేసుల వారికి ప్రత్యేక వార్డులను కేటాయించడమే గాకుండా ఎక్స్‌రే, ల్యాబ్‌ తనిఖీ కేంద్రాల్లో ఉన్న పరికరాలను ఉపయోగించుకునేందుకు కొన్ని గోడలు పడగొట్టి ప్రత్యేక ద్వారాలు వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని సూచించారు. వైరస్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య సిబ్బందికి వివరించారు. సింగరేణి ఉద్యోగులు, వైద్య సిబ్బంది వారి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సింగరేణి ఏరియా దవాఖాన మొదటి అంతస్తులో ట్రాన్సి స్టు రూం, ఐసీయూ, స్పెషల్‌ వార్డు, పాజిటివ్‌ కేసుల వారికి ప్రత్యేకంగా 600 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జీఎంతోపాటు దవాఖాన సీఎంఈవో వెంకటేశ్వరరావు, ఎస్‌వోటూ జీఎం త్యాగరాజు, డీవైసీఎంవో రమేశ్‌బాబు, యాదవరెడ్డి, రత్నమాల తదితరులున్నారు. అలాగే ఆర్జీ-1 పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వివిధ జబ్బులు, తీవ్రమైన రుగ్మతలతో బాధపడుతున్న వారికి మెడికల్‌ గ్రౌండ్‌ కింద అనుకూలమైన క్వార్టర్లను సోమవారం అధికారులు కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించారు. 

10 మందికి కారుణ్య నియామక పత్రాలు

ఆర్జీ-1 పరిధిలో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, మృతి చెందిన ఉద్యోగుల డిపెండెంట్లకు జీఎం కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్జీ-1లో 10 మంది కార్మికుల డిపెండెంట్లకు ఈ ఉద్యోగ నియామక పత్రాలను జీఎం పంపిణీ చేశారు. వీరిలో 9 మంది మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, ఒకటి డెత్‌ కేసు కాగా, వీరికి శ్రీరాంపూర్‌ ఏరియాలో పోస్టింగ్‌ ఇచ్చారు. అనంతరం జీఎం మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగంలో చేరుతున్న డిపెండెంట్లు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని, కంపెనీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారుల సంఘం రిప్రజెంటేటివ్‌ రాజన్న, పీఎం రమేశ్‌, టీబీజీకేఎస్‌ ఆఫీస్‌ ఇన్‌చార్జి ప్రవీణ్‌, డీవైపీఎం సమ్మయ్య తదితరులున్నారు.