బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jul 26, 2020 , 02:02:02

జిల్లాకు కోటి 53 లక్షల 78వేల చేప పిల్లలు

జిల్లాకు కోటి 53 లక్షల 78వేల   చేప పిల్లలు

  • n 1072 చెరువుల్లో    పెంచేందుకు ఏర్పాట్లు 
  • n సరస్వతీ బరాజ్‌లో 8.93, పార్వతీ   బరాజ్‌లో 11.41లక్షలు
  • n ఎల్లంపల్లిలో 12.21 లక్షలు,   నంది రిజర్వాయర్‌లో 6.9 లక్షలు
  • n బరాజ్‌లు, జలాశయాల్లో     19 లక్షల రొయ్య పిల్లలు
  • n చివరి దశలో టెండర్ల ప్రక్రియ n ఆగస్టులో చేప  విత్తనాల పంపిణీకి       మత్స్యశాఖ సన్నద్ధం 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ:  పెద్దపల్లి జిల్లా మత్స్య ప్రణాళిక సిద్ధమైంది.  2020-21 ఆర్థిక సంవత్స రంలో చిన్నా, పెద్ద చెరువుల్లో చేపలు వదిలేందు కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే  నాలుగు సంస్థల నుంచి టెండర్లను సైతం స్వీకరించింది.   మత్స్యకారులకు పంపిణీ చేసేందుకు అన్ని చర్య లు చేపడుతున్నది. గతేడాది మత్స్యశాఖ పరిధిలో ని 188 చెరువులు, కుంటల్లో  సుమారు 24లక్షల 70 వేల చేప పిల్లలను పంపిణీ చేసింది.  ఈ యే డు మత్స్యశాఖ పరిధిలోని 188, పంచాయతీల పరిధిలోని 880 చెరువులు, కుంటలు, సరస్వతీ, పార్వతీ బరాజ్‌లు, ఎల్లంపల్లి జలాశయాల్లో  ఏకంగా కోటి 53లక్షల 78వేల 918 చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. వర్షాలు అనుకూలించ కపోతే మాత్రం వీటి సంఖ్యలో తేడా వచ్చే అవ కాశం ఉంటుంది. 

గతేడాది రూ. 57.32 కోట్ల ఆదాయం..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చేప పి ల్లల పంపిణీ ద్వారా జిల్లాలోని మత్స్యకారులకు రూ. 57.32కోట్ల అదనపు ఆదాయం లభించిం ది. 2019-20 మత్స్య ప్రణాళిక ప్రకారం జిల్లాలోని 1013 చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల లో 151.41లక్షల చేప పిల్లలను పంపిణీ చేయగా సగటున 7240 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. జిల్లాలో 161 మత్స్య సహకార సంఘాలు ఉం డగా 9982మంది సభ్యులు ఉన్నారు. సరస్వతీ, పార్వతీ బరాజ్‌, ఎల్లంపల్లి జలాశయంలో 19 లక్షల రొయ్యపిల్లలను వదలగా 38 టన్నుల   దిగుబడి లభించింది. మత్స్య కారులకు మరింత ప్రయోజనాన్ని చేకూర్చే దిశగా మత్స్యశాఖ ముం దుకెళ్తున్నది.  

కాళేశ్వరం..మత్స్యకారులకు వరం..

సర్కారు నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్టు జిల్లాలోని  మత్స్యకారులకు వరంలా మారింది. జిల్లాలో 111 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించి ఉండే గోదావరినదిలో గల సరస్వతీ, పార్వతీ బరాజ్‌, ఎల్లంపల్లి, నందిమేడారం రిజర్వాయర్లలో 38. 50 లక్షల చేప పిల్లలు, 19 లక్షల రొయ్యపిల్లలను వదలనున్నారు. వీటిల్లో బొచ్చె, రవ్వు, కట్ల రకాలను పెంచనున్నారు.  గోదావరికి దిగువన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అన్నారం వద్ద 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన సరస్వతీ బరాజ్‌ బ్యాక్‌ వాటర్‌ ఏరియా అంతా పెద్దపల్లి జిల్లాలో విస్తరించి ఉండడంతో అందులో 8.79 లక్షల చేప పిల్లలు, 4లక్షల రొయ్య పిల్లలు, దానికి ఎగువన మంథని మండలం సిరిపురం వద్ద 8.8టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన పార్వతీ బరాజ్‌లో 11.41లక్షల చేప పిల్లలు, 4లక్షల రొయ్య పిల్లలు, 20.17టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రామగుండం మండలం ఎల్లంపల్లిలో 12.21లక్షల చేప పిల్లలు, 4లక్షల రొ య్య పిల్లలు, ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్‌లో 6.09లక్షల చేప పిల్లలను వదలనున్నారు.  

1068 చెరువుల్లో..

జిల్లాలో మత్స్య శాఖ పరిధిలోని 1068చెరువు లు, గ్రామ పంచాయతీల పరిధిలోనికుంటల్లో ప్ర భుత్వం నుంచి కోటి 15 లక్షల చేప విత్తనాలను పంపిణీ చేయనున్నారు. చెరువులు కుంటల్లో బొ చ్చె, రవ్వు,  బంగారు తీగ రకాలను  వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచే చేప విత్తనాలను  పంపిణీ చేయగా ఈ ఏడాది సైతం అదే నెలలో చేప పిల్లలను పోసే విధంగా చర్యలు చేపడుతున్నారు.  గతంలో మైనర్‌ ఇరిగేషన్‌ సొసైటీల్లో మాత్రమే 80-100మిల్లీ మీటర్ల పొడువుండే చేప పిల్లలను వేయగా గతేడాది నుంచి పెద్దచెరువులు ఏడాదంతా నీరుండే చెరువుల్లో 80-100మిల్లీ మీటర్ల చేప పిల్లలు, సీజనల్‌ ట్యాంకు(చిన్న చెరువు)ల్లో 35-40మిల్లీ మీటర్ల సైజు చేప పిల్లలను నీటి విస్తీర్ణాన్ని బట్టి పోస్తున్నారు.  

చకచకా టెండర్ల ప్రక్రియ..

జిల్లాలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లో కోటికి పైగా చేప పిల్లలను వదలనుండడంతో ఇప్పటికే ఈ ప్రొక్యూర్‌ మెంట్‌ ద్వారా టెండర్లను పిలిచారు. ఇందుకు గాను 5 సీడ్‌ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. టెక్నికల్‌ బిడ్స్‌ ఓపెన్‌ చేయగా ఇందులో రెండు కంపెనీలు  అర్హత సాధించాయి. ఇప్పటికే ఫ్రీక్వాలిఫికేషన్‌ బిడ్‌, టెక్నికల్‌ బిడ్లు పూర్తి కాగా చివరగా ఫైనాన్షియల్‌ బిడ్‌ పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా అదనపు కలెక్టర్‌ నేతృత్వంలోని  పై మన్‌  కమిటీ ఈ కంపనీలను పిలిచి చివరగా ఏ ధరకు ఇస్తారో అడిగి ఫైనల్‌ చేయనున్నారు. సీడ్‌ యొక్క నాణ్యతను, ఆరోగ్య పరిస్థితిని సైతం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షించనున్నారు. ఇవన్నీ పూర్తయితే నీళ్లు నిండగానే  సరఫరాకు ఆర్డర్లు ఇచ్చి చేప పిల్లలను తీసుకురానున్నారు. 

పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.. 

మత్స్యశాఖ పరిధిలోని సరస్వ తీ, పార్వతీ బరాజ్‌లు, ఎల్లంపల్లి, నందిమేడారం రిజర్వాయర్లతో పాటుగా 188చెరువులు, పంచాయతీల పరిధిలోని 880 చెరువుల్లో ఏకంగా కోటి 53లక్షల 78వేల 918 చేప పిల్లలను పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టులో  ప్రక్రియను ప్రారంభిస్తాం. టెండర్లు సైతం చివరి దశలో ఉన్నాయి. టెండర్లకు సంబంధించిన సీడ్‌ ఫాంలను ములు గు నుంచి వచ్చిన అధికారుల బృందం క్షేత్ర స్థా యిలో పరిశీలన చేసింది.  తదుపరి ఉత్తర్వుల మేరకు టెండర్లను ఖరారు చేసి ఫైనాస్సియల్‌ బిడ్‌ పూర్తి చేస్తాం. 

- పెద్దపల్లి జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి మల్లేశం