మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Jul 23, 2020 , 02:56:14

వన మహోత్సవం విజయవంతం చేయాలి

వన మహోత్సవం విజయవంతం చేయాలి

గోదావరిఖని: కోలిండియా ఆదేశానుసారం సింగరేణి ఆర్జీ-1 పరిధిలో గురువారం నిర్వహించనున్న వన మహోత్సవాన్ని విజయవంతం చే యాలని ఆర్జీ-1 జీఎం కే నారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మేడిపల్లి ఓపెన్‌కాస్టులోని డం ప్‌ యార్డులో వన మహోత్సవ ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, ఈ వన మహోత్సవానికి మంత్రి, కలెక్టర్‌, రాజకీయ ప్రముఖలు, అత్యున్నత స్థాయి అధికారులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వన మహోత్సవం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దాలని, గోదావరి నది పక్కనే ఉన్నందున ఓబీ డంప్‌ యార్డులో ఉన్న ఎత్తయిన మట్టి దిబ్బలను చదును చేయాలని సూచించారు. 

వన మహోత్సవం వేడుకను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి కోలిండియాతో సహా ఒకే సమయానికి ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని, సమష్టిగా ఈ కార్యక్ర మం నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో శానిటైజర్లు, మా స్కులు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామ గుండం తహసీల్దార్‌ సురేశ్‌, ఎస్‌వోటూ జీఎం త్యాగరాజు, మేడిపల్లి ఓసీపీ అధికారి సత్యనారాయణ, డీజీఎంలు సివిల్‌, నవీన్‌ కుమార్‌, సరోత్తమ్‌, మేనేజర్‌ గోవింద రాజు, పీఎం రమేశ్‌, ఫారెస్టు అధికారి డేవిడ్‌ అభిలాష్‌, సేఫ్టీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఎస్టేట్‌ అధికారి సాంబశివరావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి పాల్గొన్నారు.