శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jul 22, 2020 , 02:34:01

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

మంథని టౌన్‌: సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ సూచించారు. పట్టణంలోని 2వ వార్డులో మంగళవారం వార్డు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగు కాలువలు, రోడ్లను పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించడంతో పాటు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మురుగునీరు నిలువ ఉండకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దన్నారు. బయటికి వెళ్లే సమయంలో మాస్కులను ధరించడంతో పాటు శానిటైజ్‌ చేసుకొని, భౌతిక దూరాన్ని పాటిస్తూ  పనులు చేసుకోవాలని తెలిపారు. ఆమె వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు ఆసిఫ్‌, బాబా, ఆర్పీ మల్లీశ్వరి, ఆశ వర్కర్‌ రాధ ఉన్నారు.