మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jul 20, 2020 , 02:44:32

మరో ఐదు నిమిషాలైతే ఇంటికి..

మరో ఐదు నిమిషాలైతే ఇంటికి..

అప్పటి వరకు సరదాగా మాట్లాడుకుంటూ వాహనంలో వస్తున్న ఆ ఇద్దరు మిత్రులకు అదే చివరి ప్రయాణమైంది. మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరుతామనుకుంటుండగానే అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదం బలితీసుకున్నది. శనివారం అర్ధరాత్రి వీరు వస్తున్న బొలెరో వాహనం మంథని పట్టణ శివారులో ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరూ మృత్యువాతపడగా, ఈ ఘటన మంథనిలో విషాదం నింపింది.   

 మంథని టౌన్‌: మరో ఐదు నిమిషాలతై ఇంటికి చే రేవారు. కానీ అంతలోనే మృత్యువు ఒడికి చేరా రు.  గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు  దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మంథని పట్టణ శివారులో శనివారం అర్ధరాత్రి జరిగింది. మంథని ఎస్‌ఐ ఓంకార్‌ యాదవ్‌ కథనం ప్రకారం.. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌కు చెందిన మందల రవీందర్‌రెడ్డి (46), రామగిరి మండలంలోని రత్నాపూర్‌కు చెందిన వట్టెం నాగరాజు (39) వ్యాపారపరంగా మంచి మిత్రులు. రవీందర్‌రెడ్డి కాంట్రాక్టర్‌గా.. నాగరాజు వ్యాపారస్తుడి గా మంథనిలో సిర్థపడ్డారు. అయితే శనివారం వీరిద్దరూ కలిసి రవీందర్‌రెడ్డి స్వగ్రామం ఎగ్లాస్‌పూర్‌కు రవీందర్‌రెడ్డి బొలేరో వాహనంలో వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా, మంథని పట్టణ శివారులోని పోచమ్మ గుడి సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహ నా న్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడడంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జయిం ది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మంథనికి తరలించారు. రవీందర్‌రెడ్డి భార్య   ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద  విషయం తెలియగానే పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలింపును పర్యవేక్షించారు. బాధిత కుటుం బసభ్యులను ఓదార్చారు.