సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jul 19, 2020 , 03:31:23

అధైర్య పడకండి.. మేమున్నాం

అధైర్య పడకండి.. మేమున్నాం

గోదావరిఖని: కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, ఆసరాగా మేమున్నామంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అభయమిచ్చారు. క్యాంపు కార్యాలయంలో శనివారం నగరంలోని 50 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ కరోనా వారియర్స్‌ను ఆయన నియమించారు. అలాగే టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామగుండం నియోజక వర్గంలో ఇప్పటివరకు 85 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా సోకి ఆయా డివిజన్లలో హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి టీఆర్‌ఎస్‌ కరోనా వారియర్స్‌ ఆసరాగా నిలుస్తారన్నారు. వారికి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తారని తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడితే రామగుండం ఎమ్మెల్యే పేరిట ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 8666లో సంప్రదించాలని కోరారు. ప్రజలంతా అప్రమత్తమై కొద్ది రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. 

కరోనా వారియర్లు వీరే...

నగరంలోని 50 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ కరోనా వారియర్లను ఎమ్మెల్యే నియమించారు. 1వ డివిజన్‌కు బద్రి రాజు, 2కు ఎన్‌వీ రమణారెడ్డి, 3కు కుమ్మరి శ్రీనివాస్‌, 4కు నడిపెల్లి అభిషేక్‌ రావు, 5కు కల్వచర్ల కృష్ణవేణి, 6కు కాల్వ స్వరూప, 7కు వేగోళపు రమాదేవి, 8కి దాతు శ్రీనివాస్‌, 9కి తోకల దీప, 10కి అడ్డాల గట్టయ్య, 11కు వడ్డేపల్లి రాజేశ్వరి, 12కు బొడ్డు రజిత, 13కు ర్యాకం శ్రీమతి వేణు, 14కు నీల పద్మ, 15కు శంకర్‌ నాయక్‌, 16కు పాషా, 17కు సాగంటి శంకర్‌, 18కి బాదె అంజలి, 19కి తాళ్ల అమృతమ్మ, 20కి కన్నూరి సతీశ్‌కుమార్‌, 21కి సలీం బేగ్‌, 22కు దీటి బాలరాజు, 23కు కుమ్మరి శారద, 25కు సాగి సౌమ్య, 26కు మంచికట్ల దయాకర్‌, 27కు అచ్చ వేణు, 28కి పులెందర్‌, 29కి రాజమణి, 30కి బంగి అనిల్‌కుమార్‌, 31కి అడ్డాల స్వరూప, 32కి ఐత శివకుమార్‌, 33కు దొంత శ్రీనివాస్‌, 34కు జంజర్ల మౌనిక, 35కు పాముకుంట్ల భాస్కర్‌, 36కు గుండు రాజు, 37కు చెల్కలపల్లి స్వప్న, 38కి జంగపల్లి సరోజన, 39కి జెట్టి జ్యోతి, 40కి విజయలక్ష్మి, 42కు బాల రాజ్‌కుమార్‌, 43కు ధరణి స్వరూప, 44కు ఇనుముల శ్రీదేవి, 45కి కొమ్ము వేణుగోపాల్‌, 46కు పాతపెల్లి లక్ష్మి, 47కు మేకల సదానందం, 48కి పొన్నం విద్య, 49కి నూతి తిరుపతి, 50వ డివిజన్‌కు మహాలక్ష్మిని నియమించారు.