బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jul 18, 2020 , 02:55:58

సమన్వయంతోనే ముందంజ

సమన్వయంతోనే ముందంజ

  •  పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతీ హోళికేరి n  బాధ్యతల స్వీకరణ

పెద్దపల్లి నమస్తే తెలంగాణ: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తేనే జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తుందని పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. పెద్దపల్లి కలెక్టర్‌ బదిలీ అయిన నేపథ్యంలో మంచిర్యాల కలెక్టర్‌గా ఉన్న ఆమెకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించగా, శుక్రవారం ఆమె ఇక్కడకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ వీ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ భారతీ హోళికేరి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఇన్‌చార్జి డీఆర్వో కే నర్సింహమూర్తి, డీఏవో తిరుమల్‌ప్రసాద్‌, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ తిరుపతిరావు, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఇస్మాయిల్‌, జిల్లా సహకారాధికారి చంద్రప్రకాశ్‌ రెడ్డి, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు, కలెక్టర్‌ కార్యాలయ ఏవో కేవైకే ప్రసాద్‌, జిల్లా ఉద్యానశాఖాధికారి జ్యోతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పలువురు ఉద్యోగులున్నారు.