సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jul 12, 2020 , 01:30:42

పోలీసులు ఆదర్శంగా నిలవాలి

పోలీసులు ఆదర్శంగా నిలవాలి

యైటింక్లయిన్‌ కాలనీ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో పోలీసులు పాలుపంచుకొని సామాన్య ప్రజానీకానికి ఆదర్శంగా నిలవాలని గోదావరిఖని సబ్‌ డివిజనల్‌ ఏసీపీ వీ.ఉమేందర్‌ సూచించారు. హరితహారంలో భాగంగా శనివారం గోదావరిఖని టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆయన సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు పచ్చదనం కొంతమేరకు  రిలీఫ్‌ ఇస్తుందని తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ ఒక ఉద్యానవనాన్ని తలపించేలా మొక్కలు నాటాలన్నారు. రోజువారీగా విధులకువచ్చే సిబ్బంది తమవంతు బాధ్యతగా మొక్కలకు నీళ్లు పోసి వాటిని సంరక్షించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో హరితహారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.  ఇతర శాఖల సిబ్బంది కంటే పోలీస్‌ సిబ్బందే ముందు వరుసలో నిలవాలని సూచించారు. కార్యకమంలో సీఐ శ్రీనివాస రావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఉన్నారు.