మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Jul 12, 2020 , 01:30:41

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

  • ప్రభుత్వ దవాఖానలో  ప్రత్యేక వార్డుల ఏర్పాటు nరామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ nదవాఖానలో వార్డుల సందర్శన

గోదావరిఖని : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డును శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కలేమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం చర్యలు చేపడుతూనే ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేసిందని కానీ కొందరి నిర్లక్ష్యం తోనే బాధితులు పెరుగుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌, వైద్య  ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లోని ప్రధాన దవాఖానల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  ప్రత్యేక వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, జిల్లా మెడికల్‌ అధికారి వాసుదేవారెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి దవాఖాన వైద్యులు ఉన్నారు. 

సంక్షేమంలో దేశానికే ఆదర్శం

పాలకుర్తి : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. శనివారం పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామ ఉపసర్పంచ్‌ కోల శివయ్య తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి చందర్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు.  పార్టీలో చేరిన వారిలో సీనియర్‌ నాయకులు తుంగనర్సయ్య ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ముల్కలకొమురయ్య, గోసికశ్యాం నాయకులు తదితరులు పాల్గొన్నారు.