శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Jul 11, 2020 , 02:07:56

ఎవెన్యూ ప్లాంటేషన్‌ తప్పనిసరి

ఎవెన్యూ ప్లాంటేషన్‌ తప్పనిసరి

పెద్దపల్లి జంక్షన్‌: ప్రధాన, అంతర్గత రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ తప్పనిసరిగా చేయాలని డీఎఫ్‌వో మాదాసు రవిప్రసాద్‌ సూచించారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశాల మేరకు పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో హరిత హారం, హరితహారం, పారిశుద్ధ్య పనులు, నర్సరీ, శ్మశాన వా టికను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిట్టూర్‌లో డంప్‌ యార్డుకు కావాల్సిన స్థలాన్ని సేకరించాలని సం బంధిత అధికారులకు సూచించారు. నర్సరీలో ఖాళీ సం చులు ఉండకుండా విత్తనాలు వేయాలని ఆదేశించారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి అవసరమయ్యే ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మొ క్కలు నాటారు. ఆయన వెంట సర్పంచ్‌ ఆరెపల్లి కవిత, ఎంపీటీసీ రాజయ్య, అటవీశాఖ అధికారి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని గుట్టబోరు వద్ద సర్పం చ్‌ కొమ్ము శ్రీనివాస్‌, పాలక వర్గ సభ్యులు కలిసి మొక్కలు నాటారు. నిట్టూర్‌లో సర్పంచ్‌ ఆరెపల్లి కవిత స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, నర్సరీ పరిశీలించి, ఆటో స్టాండ్‌ వద్ద మొక్కలు నాటారు. అలాగే గ్రామస్తులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

కాల్వశ్రీరాంపూర్‌ : వెన్నంపల్లి, అంకంపల్లిలో సర్పంచులు  మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు కాసం శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల చిరంజీవి, ఎంపీటీసీ జెట్టి దేవన్న, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

విజయవంతం చేయాలి

కమాన్‌పూర్‌: హరితహారాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ రాచకొండ లక్ష్మి కోరారు. జూలపల్లి సర్పంచ్‌ బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆదర్శనగర్‌లోని వానర వనం లో, ముల్కలపల్లిలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో పండ్ల మొక్కలను నాటారు. అలాగే ఆదర్శనగర్‌లో శ్మశాన వాటిక పక్కన వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సాయినాథ్‌, డీఎల్‌పీవో రాంబాబు, ఎంపీవో వాజిద్‌, ఉపసర్పంచ్‌ సాయికుమార్‌, ఎంపీటీసీ శంకరయ్య తదితరులున్నారు.

రామగిరి: రత్నాపూర్‌లో రామగిరి తహసీల్దార్‌ ఇందారపు పుష్పలత, సర్పంచ్‌ పల్లె ప్రతిమ పీవీ రావు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. హరితహారంలో గ్రామస్తులు పా ల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని తహసీల్దార్‌, సర్పంచ్‌ కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ధర్ముల రాజ సంపత్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రశాంత్‌, సెక్రటరీ ఉప్పులేటి ప్రదీప్‌, కో-ఆప్షన్‌ సభ్యులు ఉనుగొండ మధుకర్‌రావు, గెల్లు కృష్ణ, సాగర్ల తిరుపతి, నగునూరి సతీశ్‌, కారోబార్‌ కొండపర్తి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  

సెంటినరీకాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీ, ఉద్యానవనాన్ని ఆర్జీ-3 జీఎం కే సూర్యనారాయణ  సంద ర్శించారు. ఆర్జీ-3 పరిధిలో సుమారు 5 ఎకరాల స్థలంలో నూతనంగా నర్సరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో సుమారు 6 లక్షల మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్‌ కర్ణ, సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ లక్ష్మీనారాయణ ఉన్నారు.

ఎలిగేడు: ధూళికట్ట ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో సర్పంచ్‌ గొల్లె కావేరి భూమేశ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటా రు. ఇప్పటి దాకా గ్రామంలో 1,200 మొక్కలు నాటామని సర్పంచ్‌ చెప్పారు. ఈ సందర్భంగా 400 పండ్ల మొక్కలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, మండల ప్రత్యేకాధికారి తిరుపతిరావు, ఎంపీవో అనిల్‌రెడ్డి, డాక్టర్‌ నిస్సీక్రిస్టినా, ఏపీఎం సుధాకర్‌,   పాల్గొన్నారు. అలాగే శివపల్లి సర్పంచ్‌ దుగ్యాల శ్వేత సంతోష్‌రావు ఆధ్వర్యంలో గ్రామంలోని దుకాణాల యజమాను లు, 15 మంది గ్రామస్తులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ అజయ్‌, కార్యదర్శి వినోద్‌కృష్ణ, ఏఎన్‌ఎం శారద, ఆశ వర్కర్‌ రాధిక పాల్గొన్నారు.