బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jul 11, 2020 , 02:03:30

ఘనంగా లూయిస్‌ డాగురే వర్ధంతి

ఘనంగా లూయిస్‌ డాగురే వర్ధంతి

కోల్‌సిటీ: కెమెరా సృష్టికర్త, ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్‌ డాగురే 169వ వర్ధంతిని ఫొటోగ్రాఫర్లు ఘనంగా చేసుకున్నారు. గోదావరిఖని నగరం లక్ష్మీనగర్‌లో శుక్రవారం జిల్లా ఫొటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ గనుముక్కుల మహాలక్ష్మీ తిరుపతి ముఖ్యఅతిథిగా హాజరై లూయిస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫొటోగ్రఫీ వృత్తిపై ఆధారపడి చాలా మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. దీనికి కారణమైన కెమెరా సృష్టికర్తను మర్చిపోకుండా స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఫొటో, వీడియో గ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అం దిస్తామన్నారు. అనంతరం కార్పొరేటర్‌ను ఫొటోగ్రాఫర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లకు మాస్కులను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్‌, గౌరవ సలహాదారులు సిగిరి ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, వనపర్తి శ్రీనివాస్‌, ఎలగందుల శ్రీనివాస్‌, మల్లేశ్‌, శ్రీనివాస్‌, దాసరి తిరుపతి, పుట్ట సతీశ్‌, సాగర్‌, ఇర్ఫాన్‌, కిరణ్‌, కిశోర్‌, రఘు, సమ్మయ్య, శ్యాం ప్రసాద్‌, సుబ్రహ్మణ్యం తదితరులున్నారు.

పాలకుర్తి: లూయిస్‌డాగురే వర్ధంతిని పాలకుర్తి మండల ఫొటో వీడియో గ్రాఫర్స్‌ ఆధ్వర్యంలో ఈసాలతక్కళ్లపల్లిలో చేసుకున్నారు. ఈ సందర్భంగా లూయిస్‌డాగురే చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు భూమన్న, ప్రధానకార్యదర్శి నరేశ్‌వైద్య, కోశాధికారి ప్రకాశ్‌, నాయకులు కిషన్‌, శ్రీనివాస్‌, సాగర్‌, సాయిరాజ్‌, మధు, రామూర్తి పాల్గొన్నారు.

మంథని టౌన్‌: లూయిస్‌ డాగురే వర్ధంతి పట్టణంలోని ఫొటోగ్రాఫర్స్‌ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌, బతుకమ్మ చౌరస్తాల్లో ఫొ టో గ్రాఫర్లు వేర్వేరుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.   కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్‌ జెట్టి శంకర్‌, తూర్పాటి సత్యనారాయణ, తొగరి కిరణ్‌కుమార్‌, కిశోర్‌, మహేశ్‌, నర్సింగ్‌, కుమార్‌, దామోదర్‌, వెంకటేష్‌, సాయికిరణ్‌, ప్రవీణ్‌, మిట్టపల్లి కిశోర్‌, కొమురోజు సురేశ్‌, రాపర్తి అఖిల్‌, ఏల్పుల సామ్రాట్‌, అంబటి నర్సింగ్‌, దండు రమేశ్‌, అరవింద్‌, మిట్టపల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.