శుక్రవారం 07 ఆగస్టు 2020
Peddapalli - Jul 11, 2020 , 02:03:34

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం

గోదావరిఖని: ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అహర్నిశలు పాటుపడుతున్నారని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 10, 48 డివిజన్లలో శుక్రవారం 6వ విడుత హరితహారంలో పాల్గొని ఆయన మొక్కలు నాటారు. మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో హరితహారం చేపడుతున్నారని వివరించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు శుక్రవారం హరితలక్ష్మి చేపడుతున్నామని చెప్పారు. గతంలో మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవాళ్లమని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నర్సరీలు ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధి అందిస్తు న్నామని తెలిపారు. వాటి నుంచే మొక్కలు మున్సిపల్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నామని చెప్పా రు.  ప్రతి మహిళ మొక్కలు నాటడంతో పా టు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, పాముకుంట్ల భాస్కర్‌, పులెందర్‌, పొన్నం విద్య లక్ష్మణ్‌, నాయకులు తానిపర్తి గోపాల్‌ రావు, దయానంద్‌గాంధీ,  సంపత్‌ ఉన్నారు. 

ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా ఉంటా 

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవే టు ఉపాధ్యాయులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయు లు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సమయంలో           అందించిన రూ.1500 నగదు ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆసరాగా నిలిచిందన్నారు. పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపునకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం బాధ్యులు ఆవుల రాజేశ్‌, చంద్రమోహన్‌, సమ్మయ్య ఉన్నారు.

మసీద్‌లో బోరు ఏర్పాటు.. 

తిలక్‌నగర్‌లోని మసీద్‌లో విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన బోరును చందర్‌ ప్రారంభించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహకారంతో ఈ మసీద్‌ అభివృద్ధికి పాటు పడుతామన్నా రు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కొమ్ము వేణుగోపాల్‌, మసీద్‌ కమిటీ బాధ్యులు జియా ఉర్‌ రెహ్మన్‌, అప్నర్‌ అలీ, శంషొద్దీన్‌, హఫీజొద్దీన్‌, ఇర్ఫాన్‌,జానీ మహ్మద్‌, హబీబుర్‌ అహ్మద్‌, అంకూస్‌, రహీం తదితరులున్నారు.

ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం..

నియోజక వర్గంలోని ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 48వ డివిజన్‌లో ఇటీవల మృతి చెందిన మునిగాల సంపత్‌రెడ్డి అనే ఆటో డ్రైవర్‌ కుటుంబానికి రూ.4వేల నగదు, 25 కేజీల బియ్యాన్ని ఆయన అందించారు. అనంతరం 50వ డివిజన్‌లో 10 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మహాలక్ష్మీ తిరుపతి, నాయకుడు లక్ష్మణ్‌ గౌడ్‌, డీటీ సురేశ్‌ ఉన్నారు. 


logo