సోమవారం 03 ఆగస్టు 2020
Peddapalli - Jul 10, 2020 , 02:34:40

‘గంజాయి’ పై ఉక్కుపాదం

‘గంజాయి’ పై ఉక్కుపాదం

  •  హుజూరాబాద్‌ డివిజన్‌లో గుట్టుగా గంజాయి దందా
  •  విద్యార్థులు, యువకులే లక్ష్యంగా అక్రమ వ్యాపారం
  •  అడ్డుకట్ట వేస్తున్న   పోలీస్‌ యంత్రాంగం

హుజూరాబాద్‌ డివిజన్‌లో  గుట్టుగా సాగుతున్న గంజాయి దందాపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. విద్యార్థులు, యువతే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారానికి నిరంతర తనిఖీలతో అడ్డుకట్ట వేస్తున్నది. మత్తులో చిక్కి చిత్తవుతున్న యువకులకు   తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేస్తూ 

తనదైన పంథాలో ముందుకుసాగుతున్నది.                   - హుజూరాబాద్‌టౌన్‌

 కొంతకాలంగా  హూజూరాబాద్‌ డివిజన్‌లో కొం దరు అక్రమార్కులు విద్యార్థులు, యువతను గం జాయి మత్తులో ముంచుతున్నారు. వారిని బానిసలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ముఠాలుగా ఏర్పడి గంజాయి సాగుచేసే అటవీ ప్రాంతాలైన ములుగు, కాటారం, మహాముత్తారం, భూ పాలపల్లి నుంచి కొందరు గంజాయిని రాత్రి వేళ ఆటోలు, ద్విచక్ర వాహనాలపై అక్కడి నుంచి హు జూరాబాద్‌కు తరలిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. సిగరెట్లలో తంబాకును తొలగించి గంజాయి మిశ్రమాన్ని కలిపి అమ్ముతు న్నా రు. ఈ అక్రమ వ్యాపారాన్ని పసిగట్టిన పోలీసులు పకడ్బందీ నిఘా పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు.  ఏడాది క్రితం హుజూరాబాద్‌టౌన్‌ సీఐ మాధవి 60 కిలోల గంజాయిని పట్టుకోగా, నెల కిందట జమ్మికుంటలో కిలో ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న సైదాపూర్‌ మండలం గుండ్లపల్లిలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తూ  పెద్ద మొత్తంలో  కలిగి ఉన్నారనే సమాచారం మేరకు హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ ఎర్రల కిరణ్‌ ఆధ్వర్యంలో సైదాపూర్‌  ఎస్‌ఐ ప్రశాంత్‌రావు సిబ్బందితో కలిసి దాడులు చేయగా ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఎండీ పర్వీన్‌ఖాన్‌, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ములుగు హరిదీప్‌, సైదాపూర్‌ మండలం గుండ్లపల్లికి చెందిన కేంసారపు రాకేశ్‌, అమ్మనగుర్తికి చెందిన లంకదాసరి భరత్‌, రాజు, హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌కు చెందిన ఆ కునూర్‌ రాజును పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5కిలోల గంజాయి, రెండు బైకులను స్వాధీనం చే సుకున్నారు. బుధవారం కూడా గంజాయి ముఠా హుజూరాబాద్‌వైపు వస్తుందనే సమాచారం మేర కు చెల్పూర్‌ సమీపంలోని హనుమాన్‌ టెంపుల్‌ వద్ద  ఇద్దరు అనుమానితులను తనిఖీ చేయగా ఐదు ప్యాకెట్ల ఎండు గంజాయి లభించిందని ఏసీపీ  శ్రీనివాస్‌రావు తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరికి చెందిన చహకటి తిరుపతి, జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు తిరుపతి గంజాయితో ప ట్టుబడ్డారన్నా రు.  వీరి నుంచి రూ. 30 వేల విలు వైన 3కిలోల 110 గ్రాముల ఎండు గంజాయి, బైకు, ఆటోను స్వాధీనం చేసుకు న్నామని ఏసీపీ వెల్లడించారు. నిందితులు  జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశం తో ముఠాగా ఏర్పడ్డారన్నారు. నిరంతర తనిఖీలతో దందాకు చెక్‌ పెడుతున్నామని చెప్పారు. 

 తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌..

 గంజాయికి బానిసలైన యువకులను, వారి తల్లిదండ్రులను గురువారం హుజూరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వ్యసనా లకు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితబోధ చేశారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులను గమనించాలని సూచించారు. 


logo