ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jul 09, 2020 , 01:38:05

వెదురుగట్ట శివారులో హరితహారం’

వెదురుగట్ట శివారులో హరితహారం’

‘హరితహారం’తో వెదురుగట్ట శివారులో గుట్టలపై పచ్చదనం పరుచుకున్నది. కొద్ది రోజులుగా పడుతున్న జల్లులకు ఫారెస్ట్‌బ్లాక్‌ ప్రాంతం భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్నది. గతేడాది హరితహారం కింద అటవీశాఖ అధికారులు 170 ఎకరాల స్థలంలో 65 వేల మొక్కలు నాటారు. 30 శాతం కోతులకు ఆహారం కోసం, 70 శాతం అటవీ రకం పెంచుతున్నారు. చుట్టూ కందకాలు తవ్వి, బౌండరీ పిల్లర్లు, ఫెన్సింగ్‌ వేసి పకడ్బందీగా సంరక్షిస్తున్నారు. ఈ మేరకు బుధవారం  మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో కలిసి అమాత్యుడు కేటీఆర్‌ ఈ వన క్షేత్రాన్ని సందర్శించారు.