శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jul 09, 2020 , 01:35:07

ఓబీని వేగంగా తరలించాలి

ఓబీని వేగంగా తరలించాలి

జూలపల్లి: గ్రామాలాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జడ్పీ సీఈవో మచ్చ గీత సూచించారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, పల్లె పకృతి వనాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు, రైతు వేదికలు, సిమెంట్‌ కల్లాల నిర్మాణాలపై మండలస్థాయి సమీక్షా సమావేశం బుధవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామాల వారీగా సర్పంచులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభివృద్ధి పనుల నిర్వహణ తీరుపై ఆకస్మిక తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తుంటాయని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్లె ప్రకృతి వనం, రైతు వేదికల కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌, సర్పంచులు దారబోయిన నరసింహం, మేచినేని సంతోష్‌రావు, వీర్ల మల్లేశం, బంటు ఎల్లయ్య, కూసుకుంట్ల మంగ, కొత్త శకుంతల, రేశవేని రాధ, కంకణాల భారతి, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో రమేశ్‌, ఏపీవో సదానందం తదితరులు పాల్గొన్నారు.

జడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీ 

తేలుకుంటలో జడ్పీ సీఈవో ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని వైకుంఠధామం, డంప్‌యార్డు, ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, పశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అలాగే సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక నిర్మాణ స్థలాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం నిర్మాణ పనులకు ఎంపీపీతో కలిసి జడ్పీ సీఈవో భూమి పూజ చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ సొల్లు పద్మ, ఎంపీటీసీ కత్తెర్ల శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ చొప్పరి నర్సింగం,  వీఆర్వో నారాయణ, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌, వార్డు సభ్యులు జనుప తిరుపతి, అడ్డగుంట శ్రీనివాస్‌, పరుశరాములు, జవ్వాజి శ్రీలత, తీగల భాగ్య, మడ్డి సమత, మడ్డి నాగమ్మ, చిప్ప రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.