శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jul 08, 2020 , 02:11:57

వ్యక్తి గత శుభ్రత పాటించాలి

వ్యక్తి గత శుభ్రత పాటించాలి

మంథని టౌన్‌ : పట్టణ ప్రజలు వ్యక్తి గత, పరిసరాల శుభ్రత పాటించి సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. పట్టణంలోని 3, 11, 12వ వార్డుల్లో మంగళవారం వార్డు సందర్శన కార్యక్రమాన్ని వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..  కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ కోసం తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తే వెంటనే సంబంధిత ఆశ వర్కర్లకు సమాచారం అందించాలన్నారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు శానిటైజర్స్‌ వాడాలన్నారు. మాస్కులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల లక్ష్మి, వీకే రవి, ఆశ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.