శనివారం 08 ఆగస్టు 2020
Peddapalli - Jul 06, 2020 , 01:24:08

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఎలిగేడు: ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్చే దాసరి మనోహర్‌డ్డి పేర్కొన్నారు. ఎలిగేడులో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే జడ్పీ వైస్‌ చైర్మన్‌ మండిగ రేణుకతో కలిసి ఆదివారం భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆరుగురు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆరో విడుత తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. కాగా ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేసి ఏడాది పాలన పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఎంపీపీ తానిపర్తి స్రవంతి, వైస్‌ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఖలీల్‌ పాషా, సర్పంచులు భూర్ల సింధూజ, మాడ కొండల్‌రెడ్డి, గోపు విజయేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, విండో చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, నాయకులు తానిపర్తి మోహన్‌రావు, మండిగ రాజనర్సు, సత్యనారాయణ, కొత్తిరెడ్డి కమలాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఓదెల: మండలకేంద్రంలో ఇటీవల ఓ ప్రమాదంలో మృతి చెందిన బుద్దె రాజు కుటుంబాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. అతడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట వైస్‌ ఎంపీపీ పల్లె కుమార్‌, మాజీ సర్పంచ్‌ ఆకుల మహేందర్‌, మాజీ ఎంపీటీసీ బోడకుంట చినస్వామి, నాయకులు కనికిరెడ్డి సతీశ్‌, తీర్తాల కుమార్‌, పోలోజు రమేశ్‌, నరేశ్‌, వెంకటస్వామి, రాజు ఉన్నారు.   


logo