శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Peddapalli - Jul 06, 2020 , 01:03:41

టూరిజం హబ్‌గా గోదావరిఖని..

టూరిజం హబ్‌గా గోదావరిఖని..

గోదావరిఖని: గోదావరిఖనికి పర్యాటక శోభ తెచ్చి టూరిజం హబ్‌గా మారుస్తామని, రానున్న రోజుల్లో కేరళ, కోనసీమ తరహాలో తీర్చిదిద్దుతామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టం చేశారు. రామగుండం నగర పాలక సంస్థ 8వ డివిజన్‌లో తెలంగాణ అడ్వెంచర్‌ అక్వాడ్‌ టూరిజం కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గోదావరికి తిరిగి ప్రాణం పోసి తూర్పున పారే నదికి పడమరకు పరుగులు నేర్పిన జల సాధకులు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. ఆయన భగీరథ ఫలితమే ఈ రోజు గోదావరిఖనికి పర్యాటక శోభ కలిగిందని పేర్కొన్నారు. గోదావరి తీరంలో టూరిజం అభివృద్ధి కోసం పడవలను తెప్పించామని, ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధితో ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు. ప్రపంచంలో జరుగుతున్న సాహస క్రీడలు, వాటర్‌ స్పోర్ట్స్‌పై తెలంగాణ అడ్వెంచర్‌ అక్వాడ్‌ టూరిజం ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, పాముకుంట్ల భాస్కర్‌, నాయకులు వేగోళపు శ్రీనివాస్‌, రవి, గోలివాడ ప్రసన్న, గోలివాడ చంద్రకళ, తోకల రమేశ్‌, కేశవ గౌడ్‌, సంపత్‌, శ్రావణ్‌ తదితరులున్నారు.  


logo