శనివారం 08 ఆగస్టు 2020
Peddapalli - Jul 06, 2020 , 00:30:18

ప్రజాసేవే జడ్పీ చైర్మన్‌ లక్ష్యం

ప్రజాసేవే జడ్పీ చైర్మన్‌ లక్ష్యం

మంథని టౌన్‌: ప్రజాసేవే పుట్ట మధూకర్‌ లక్ష్యమని విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, జడ్పీటీసీ తగరం సుమలత పేర్కొన్నారు. పుట్ట మధూకర్‌ జడ్పీ చైర్మన్‌గా ఎన్నికై సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ సమీపంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు పుట్ట మధూకర్‌ను ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలుపడంతోపాటు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా విండో చైర్మన్‌ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంతోపాటు జిల్లా అభివృద్ధికి  అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కుంట శ్రీనివాస్‌, తగరం శంకర్‌లాల్‌, ఆకుల కిరణ్‌, గర్రెపల్లి సత్యనారాయణ, కాయితి సమ్మ య్య, సత్యనారాయణ, వంశీ, దిగంబర్‌, సామ్రాట్‌, సల్మా న్‌, రవి, శ్రీకర్‌ పాల్గొన్నారు. 

ముత్తారం: జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తోపాటు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు సంవత్సర పదవీ కాలాన్ని పూర్తి చే సుకున్న సందర్భంగా మండలకేంద్రంలోని ప్రభుత్వ స్థలా ల్లో ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ స్వర్ణలత, ఎంపీటీసీలు పోతిపెద్ది కిషన్‌రెడ్డి, సుదాడి రవీందర్‌రావు, ఒద్ది తిరుమల,  రామగళ్ల పోచమ్మ, బియ్యాని శ్యామల, అల్లం తిరుపతిని టీఆర్‌ఎస్‌ నాయకులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో చెలుకల అశోక్‌, బేద సంపత్‌, కేతిరి మహేశ్వరి, మల్లేశ్‌, ఇనుముల మహేశ్‌, మొగిలి, సతీశ్‌ పాల్గొన్నారు. 

కమాన్‌పూర్‌: మండలంలోని గుండారం రిజర్వాయర్‌ కరకట్టపై టీఆర్‌ఎస్‌ మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అలాగే సిద్ధిపల్లె గ్రామ పరిధి శాలపల్లిలో దాత శంకరయ్య సహకారంతో సర్పంచ్‌ తాటికొండ శంకర్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, నాయకులు రాచకొండ రవి, రాచకొండ చంద్రమౌళి, జంగపల్లి రవి, ఆకుల గట్టయ్య, గొడిశెల సంపత్‌, పెండ్లి నారాయణ, బొల్లపల్లి శంకర్‌గౌడ్‌, బంగారు గట్టయ్య, జంగపల్లి లక్ష్మణ్‌, బొంపల్లి కుమారస్వామి, జంగిలి పోచాలు, దండె కిషన్‌ పాల్గొన్నారు. 

రామగిరి: మండలకేంద్రంలోని రామాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ మ్యాదరవేని శారద టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకేసి రవీందర్‌, వైస్‌ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, సర్పంచ్‌ అల్లం పద్మ, నాగెపల్లి సర్పంచ్‌ కొండవేన ఓదెలు యాదవ్‌, ఎంపీటీసీ కామ శ్రీనివాస్‌, టీబీజీకేఎస్‌ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు గారబోయిన నరేశ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బేతు కుమార్‌, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, ఉపసర్పంచులు దామెర శ్రీనివాస్‌, దుబ్బాక సత్యారెడ్డి, చిట్టంపల్లి అనిల్‌కుమార్‌, ఆలయ కమిటీ కార్యదర్శి అనిల్‌కుమార్‌, నాయకులు గాజుల ప్రసాద్‌, దేవ శ్రీనివాస్‌, మేడగోని రాజన్న, మడికెల శ్రీనివాస్‌, వేగోలపు మల్లయ్య, చెలుకల జవహార్‌, గద్దల శంకర్‌, చిందం రమేశ్‌, బాద్రపు ప్రశాంత్‌, ఆరు యాదవ్‌, ఉనగొండ మధూకర్‌ రావు, నాగుల శ్రీనివాస్‌, పాముల శేషగిరి, కొమ్ము నాగన్న, సత్యం, కుమార్‌, రవీందర్‌, కుమారస్వామి, లక్ష్మణ్‌, సతీశ్‌ తదితరులు ఉన్నారు.  


logo