గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jul 04, 2020 , 02:46:06

ఇంటింటికీ హరితహారం మొక్కల పంపిణీ

 ఇంటింటికీ హరితహారం మొక్కల పంపిణీ

ముత్తారం: మండలంలోని సీతంపేట గ్రామంలో శుక్రవారం సర్పంచ్ పూలిపాక నగేశ్ ఆధ్వర్యంంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో పెంచిన మొక్కలను ప్రతి ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. మొక్కలను రక్షించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రీగార్డులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు నాటిన మొక్కలు వచ్చే యేడు ఏపుగా పెరిగి కనబడాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కుల ముత్తయ్య, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యాంప్రసాద్, సిబ్బంది మల్లికార్జున్ పాల్గొన్నారు.