బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jul 04, 2020 , 02:46:08

భూ వివరాలను నమోదు చేయాలి

భూ వివరాలను నమోదు చేయాలి

  • n హరితహారం లక్ష్యాలను అధిగమించాలి  n అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

పెద్దపల్లిరూరల్: జిల్లాలో భూ సమస్యల పరిష్కారా నికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా కృషి చేయాలని, వాటి వివరాలను పక్కాగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించా రు. భూ సమస్యలు, ప్రజావాణి ఫిర్యాదులు, హరితహారం లక్ష్యాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షా సమా వేశం శుక్రవారం నిర్వహించారు. అనంతరం  తహసీల్దార్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూ ముల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డిజిటల్ సంతకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించా రు. మీ సేవ, సక్సేషన్, మ్యుటేషన్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని  కోరారు.

ఆడిట్ సమర్పించాలి..

జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నీ సకాలంలో తమ ఆడిట్ వివరాలను సమర్పించాలని ఆదేశిం చారు. జిల్లా కేంద్రం నుంచి అధికారులతో అదనపు కలెక్టర్ వీసీ నిర్వహించారు. రూ.లక్షలోపు ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలన్నీ గ్రామాల పరిధిలో, రూ.20 లక్షల పైన ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలన్నీ ఎంపీడీవో కార్యాలయాల్లో ఆడిట్ వివరాలు సమర్పించాలని సూచించారు. సకాలంలో గ్రామ పం చాయతీలు ఆడిట్ వివరాలను సమర్పించకపోతే సంబంధిత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆ ర్వో నర్సింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్, డీపీవో వేముల సుదర్శన్ పాల్గొన్నారు.