బుధవారం 05 ఆగస్టు 2020
Peddapalli - Jul 04, 2020 , 02:46:09

చెత్త సేకరణకు మినీ ట్రాలీలు

చెత్త సేకరణకు మినీ ట్రాలీలు

  • n ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • n మూడు వాహనాలు ప్రారంభం

పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో చెత్త సేకరణకు మినీ ట్రాలీలను ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. చెత్త సేకరణ కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు మినీ చెత్త సేకరణ ట్రాలీలను ఐదో వార్డులో ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెత్త సేకరణ సిబ్బందికి ఇంటి యజమానులు ప్రతి నెలా రూ. 50 చెల్లించాలని సూచించారు. ప్రజలు, కాలనీ వాసులు, వార్డు అభివృద్ధి కమిటీలు ఇందుకు సహకరించాలని కోరారు. ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటుతో దోమల నివారణ సాధ్యమవుతుందని వివరించారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా వార్డుల వారీగా విధించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఆయా వార్డు కౌన్సిలర్లు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి, వైస్ చైర్మన్ నజ్మీనా సుల్తానా మొబిన్, కౌన్సిలర్లు చందా రమాదేవి శ్రీధర్, లశెట్టి భిక్షపతి, పురుషోత్తం, పూదరి చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, గంట రమేశ్, టీచర్స్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రవీణ్, నరేందర్, వాసు, సాంబయ్య తదితరులు ఉన్నారు.logo