బుధవారం 12 ఆగస్టు 2020
Peddapalli - Jul 03, 2020 , 02:57:19

గ్రామానికో పార్కు ఏర్పాటు

గ్రామానికో పార్కు ఏర్పాటు

  • n   ఆర్డీవో కాసుల కృష్ణవేణి
  • n   దుబ్బపల్లిలో స్థల పరిశీలన

మంథని రూరల్: తెలంగాణ ప్రభుత్వం గ్రామానికో పార్కును ఏర్పాటు చేయనున్నదని ఆర్డీవో కాసుల కృష్ణవేణి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె దుబ్బపల్లి గ్రామం లో పార్కు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ, ప్రభుత్వం పట్టణాల్లో మాదిరిగా గ్రామా ల్లో పార్కుల నిర్మాణం చేపట్టనున్నదని వెల్లడించారు. మంథని మండలంలో గద్దలపల్లి మినహా అన్ని గ్రామాల్లో పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. హరితహారంలో అందరూ పాల్గొనాలని కోరా రు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటచైతన్య, సర్పంచ్ నరేశ్ రావు, జడ్పీటీసీ తగరం సుమలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు తగరం శంకర్‌లాల్, ఆయా గ్రామాల సర్పంచులున్నారు. 

తాజావార్తలు


logo