బుధవారం 12 ఆగస్టు 2020
Peddapalli - Jul 03, 2020 , 02:57:21

కమాన్‌పూర్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్

కమాన్‌పూర్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్

  • n   నిఘా నీడలో మండలం
  • n  నేడు ప్రారంభించనున్న సీపీ, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్

కమాన్‌పూర్: కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగం గా ప్రజల సహకారంతో పోలీసు శాఖ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల ని యంత్రణలో సఫలీకృతమవుతున్నది. గ్రా మగ్రామాన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నిఘాను తీవ్రతరం చేస్తున్నది. దీనికి తోడు రా త్రి వేళల్లో సిబ్బంది పెట్రోలింగ్ చర్యలను ము మ్మరం చేస్తూ నేరాలను అరికట్టడంలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో భా గంగా జిల్లాలో ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో లేని విధంగా కమాన్‌పూర్‌లో 68 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌ఐ చాంబర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను రామగుండం కమిషనర్ సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. అలాగే పోలీస్‌స్టేషన్ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు.

ప్రజల సహకారంతో..

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మండలంలోని ప్రజల సహాయసహకారాలతో గ్రామా ల్లోని ప్రధాన వాడవాడల్లో సీసీ కెమెరాలను కమాన్‌పూర్ ఎస్‌ఐ శ్యామ్‌పటేల్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేశారు. ఇందుకు లైనింగ్ ప్రక్రియ, కంట్రో ల్ ఏర్పాటు తదితర అవసరాలకు సుమారు రూ.10,30,000 ఖర్చు అయినట్లు తెలిసింది. మండలంలో తొమ్మిది గ్రామ పం చాయతీలు ఉండగా వీటికి అనుబంధంగా శివారు గ్రామాలు కూడా కలవు. మండలంలో ని అన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. క్వాలిటీ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడంతో రాత్రివేళల్లో కూడా సంఘటనా స్థలంలో ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఓఎల్‌టీ టెక్నాలజీ సీసీ కెమెరాలతో నిఘా వేయనున్నారు.

ఏయే గ్రామంలో ఎన్ని..

కమాన్‌పూర్‌లో 16 సీసీ కెమెరాలు, గుండారంలో 3, పేరపల్లిలో 2, గొల్లపల్లెలో 2, రొంపికుంటలో 8, నాగారంలో 5, సిద్దిపల్లెలో 2, దాసరిపల్లెలో 1, పెంచికల్‌పేట్‌లో 3, ఆదివరాహస్వామి ఆలయంలో 5, జూలపల్లిలో 8, పోలీస్ స్టేషన్‌లో 9, ముల్కలపల్లిలో 3, రేపల్లెవాడలో 3 సీసీ కెమెరాలు చొప్పున మొత్తం 68 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

పటిష్ట నిఘా వ్యవస్థ 

100 మంది పోలీసులు చేసే పనిని ఒక్క సీసీ కెమెరాతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయవచ్చనే సీపీ సూచనల ప్రకారం కార్యచరణను ప్రారంభించాం.  కమాన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 68 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. ఇందుకు సహకరించిన ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు.

శ్యామ్ పటేల్, ఎస్‌ఐ, కమాన్‌పూర్


తాజావార్తలు


logo