బుధవారం 12 ఆగస్టు 2020
Peddapalli - Jul 03, 2020 , 02:57:21

కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై దాడి

కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై దాడి

  • n బుధవారం అర్ధరాత్రి కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగుల హంగామా 
  • n ప్రహరీ దూకి భవన అద్దాలు ధ్వంసం 
  • n ఆరా తీస్తున్న పోలీసులు
  • కోరుట్ల టౌన్: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల వి ద్యాసాగర్‌రావు క్యాంపు కార్యాలయంపై బుధవా రం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ప్రహరీ దూకి లోపలికి వచ్చి వెల్‌వెషన్ అద్దాలను ధ్వంసం చేశారు. ఆవరణలో నాటిన హ రితహారం మొక్కల్ని పీకేశారు. భవనానికి నాలుగు వైపులా ఉన్న కిటికీ అద్దాలు, మొదటి అంతస్తు కా రిడార్ అద్దాలను రాళ్లు, రాడ్లతో ధ్వంసం చేశారు. అలాగే కార్యాలయానికి సమీపంలో ఓ వీధిలో నివాసం ఉంటున్న టీఆర్‌ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ పండిత్ రాజేశ్వర్ ఇంటి ముందు నిలిపి ఉం చిన కారు అద్దాలను కూడా పగులగొట్టారు. రాత్రిపూట కొంతమంది వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ షెడ్డు వద్ద మద్యం తాగారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. రాత్రివేళ అటుగా వెళ్లిన స్థానికులను చూసి దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, మళ్లీ అర్ధరాత్రి వచ్చి ఆఫీసులోకి వెళ్లి విధ్వంసానికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

రంగంలోకి క్లూస్ టీంలు 

క్యాంపు ఆఫీస్‌పై దాడి విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఆఫీసుకు వచ్చి పరిశీలించారు. తర్వాత క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బందిని రప్పించి, ఆధారాలు సేకరించారు. ఘ టనాస్థలిని ఏఎస్పీ దక్షిణామూర్తి, మెట్‌పల్లి డీ ఎస్పీ గౌస్‌బాబా, కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు పరిశీలించారు. తొందరలోనే దుండగులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా, దాడి విషయం తెలిసి క్యాంపు ఆఫీస్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. దుండుగులను వెం టనే పట్టుకోవాలని పోలీసులను కోరారు.  


తాజావార్తలు


logo