బుధవారం 12 ఆగస్టు 2020
Peddapalli - Jul 03, 2020 , 02:57:22

కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డలకు భరోసా

కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డలకు భరోసా

  • n  ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • n  లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ 

సుల్తానాబాద్: కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో 25మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి  మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలపై ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, తహసీల్దార్ హన్మంతరావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బిరుదు సమత, నాయకులు పాల రామారావు, బుర్ర శ్రీనివాస్, ముత్యం రమేశ్, గుర్రాల శ్రీనివాస్, వీరగోని రమేశ్‌గౌడ్, విజేందర్‌గౌడ్, పులి వెంకటేశం, పారుపెల్లి గణపతి, రేవెల్లి తిరుపతి, పారుపెల్లి జ్ఞానేశ్వరి, చింతల సునీత, రాజు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. 

ఉచితంగా ఇసుక 

మానేరు పరీవాహక ప్రాంతంలోని అన్నిగ్రామాల ప్రజలకు ఇసుక ఉచితంగా ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. సంబంధిత అధికారులను సంప్రదించి ఇసుకను తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ పనులకు ఇసుకను ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఎమ్మెల్యేకు సర్పంచుల కృతజ్ఞతలు

సుల్తానాబాద్ రూరల్: మానేరు వాగు గ్రామాల ప్రజల అవసరాలకు ఇసుకను ఉచితంగా అందిం  చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు, గర్రెపల్లి సర్పంచ్ వీరగోని సుజాత, సర్పంచులు కర్క తిరుమల, నగునూరి రాయమల్లు, కొలిపాక అరుణజ్యోతి, కోటగిరి విజేందర్, బండారి రమేశ్, మొల్గూరి వెంకటలక్ష్మి, కోడెం సురేఖ, అనిత కృతజ్ఞతలు తెలిపారు. మానేరువాగు సమీప గ్రామాలైన గర్రెపల్లి, తొగర్రాయి, మంచరామి, గట్టెపల్లి, నీరుకుళ్ల, గొల్లపల్లి, నారాయణరావుపల్లి,  కదంబాపూర్, బొంతకుంటపల్లి గ్రామాల ప్రజలకు ఇసుక ఉచితంగా తీసుకునే అవకాశం ఉంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు కోరారు.

తాజావార్తలు


logo