సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jul 02, 2020 , 03:41:11

ఉనికి కోసమే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

ఉనికి కోసమే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

జూలపల్లి : ఉనికి కోసమే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి పేర్కొన్నారు. జూలపల్లిలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మండల కేంద్రంలో మంగళవారం రైతులు చేపట్టిన ధర్నాను ఆసరాగా చేసుకొని టీఆర్‌ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.  తహసీల్దార్ శ్రీనివాస్‌రావును కించపర్చేలా మాట్లాడడంపై  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయరమణారావు తన రైస్ మిల్లులో ధాన్యం తరుగు లేకుండా ఎంత మంది రైతులకు మేలు చేశారని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే పదవి చేపట్టి జూలపల్లి మండలానికి ఏం ఒరగబెట్టారని పేర్కొన్నారు. దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జూలపల్లి సర్పంచ్ దారబోయిన నరసింహం, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, సర్పంచులు మేచినేని సంతోష్‌రావు, వీర్ల మల్లేశం, బంటు ఎల్లయ్య, మాంకాలి తిరుపతి, పొలవేని వీరయ్య, కుంటూరి రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు తమ్మడవేని మల్లేశం, నాయకులు కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, పాటకుల అనిల్, సొల్లు శ్యామ్, రేశవేని శ్రీనివాస్, నాడెం మల్లారెడ్డి, తొంటి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.